డిశ్చార్జ్ అయిన తరువాత మధులిక ఏం చెప్పిందంటే..

డిశ్చార్జ్ అయిన తరువాత మధులిక ఏం చెప్పిందంటే..
x
Highlights

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక పూర్తిగా కోలుకుంది. బుధవారం మలక్‌పేట యశోద హాస్పిటల్ నుంచి డిచార్జీ అయింది. గత 15 రోజులుగా ఆస్పత్రిలో...

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక పూర్తిగా కోలుకుంది. బుధవారం మలక్‌పేట యశోద హాస్పిటల్ నుంచి డిచార్జీ అయింది. గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక కోలుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ప్రాణాపాయం లేదని, లోపలి గాయాలు తగ్గడానికి మరికొన్ని రోజులు ఇంటివద్దే ఉండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు పేర్కొన్నారు. మధులిక వైద్య ఖర్చులు ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు కాగా…సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇప్పటికే 5 లక్షల రూపాయలు యశోదా ఆస్పత్రికి అందింది. ఇదిలావుంటే ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయిన మధులిక తనకు ఇది పునర్జన్మ అని సంతోషం వ్యక్తం చేసింది. దాడి జరిగిన తరువాత తాను ప్రాణాలతో బయటపడతానని అసలు అనుకోలేదంటూ చెప్పింది. తనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని దేవుడ్ని ప్రార్థించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories