చినుకు లేక ఓ మంత్రిలో వణుకు..వాన పడకపోతే, ఆ మినిస్టర్‌కు..

చినుకు లేక ఓ మంత్రిలో వణుకు..వాన పడకపోతే, ఆ మినిస్టర్‌కు..
x
Highlights

చినుకుపడకపోతే అందరికీ వణుకే. రైతులు, వ్యాపారులు, పాలకులు, ఇలా అందరికీ వానపడకపోతే, మనసులో గుబులు తప్పదు. కానీ ఓ మంత్రిగారికి, అందరి కంటే కాస్త ఎక్కువ...

చినుకుపడకపోతే అందరికీ వణుకే. రైతులు, వ్యాపారులు, పాలకులు, ఇలా అందరికీ వానపడకపోతే, మనసులో గుబులు తప్పదు. కానీ ఓ మంత్రిగారికి, అందరి కంటే కాస్త ఎక్కువ భయం పట్టుకుందట. సెంటిమెంట్‌పరంగా కూడా టెన్షన్‌ క్రియేట్ చేస్తోందట. సెక్రటేరియట్‌లో ఇప్పుడు ఆ మంత్రి గురించే చర్చట. వాన పడకపోతే, ఆ మినిస్టర్‌కు ఎందుకంత వణుకు?

సాధారణంగా నైరుతి రుతుపవన కాలం జూన్ రెండవ వారం నుంచి మొదలైతుంది. దీంతో జులై మొదటి వారం వరకు విత్తనాలు చల్లుకోవటం పూర్తయితే సమయానికి పంట చేతికొస్తుంది. జూన్‌లో పెద్దగా వానలు కువరలేదు. దీంతో రైతులు విత్తనాలు నాటలేదు. చాలామంది రైతాంగం జూలై మొదటివారంలో, చేతిలో డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి నాటారు. వర్షాలు లేకపోవడంతో ఇప్పడు రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మరో వారంపాటు వర్షాలు కురవకపోతే విత్తిన పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతేకాక మొల‌కదశ‌లో ఉన్న పంట‌లు ఎండిపోయే ప్రమాదం ఉంద‌ని రైత‌న్నలు ఆందోళ‌న చెందుతున్నారు. వీరే కాదు, తొలిసారి కేబినెట్‌లో అడుగుపెట్టి, అందులోనూ వ్యవసాయ శాఖ చేపట్టిన మంత్రిగారికి చాలా దిగులు పట్టుకుందట.

వర్షాభావం ఇలానే కొనసాగితే ఎలా అనేదానిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి టెన్షన్‌ పడుతున్నారని, ఆయన పేషిలో చర్చించుకుంటున్నారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత మంత్రి పదవి వరించడం, సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ కేటాయించడంతో సంతోషపడ్డారు నిరంజన్. కాని వరుణుడు ఈసారి కనికరించక పోవడంతో వ్యవసాయశాఖపై ప్రభావం పడుతుందని అంటున్నారు ఆయన పేషి అధికారులు.

పంటపెట్టుబడి సాయం సకాలంలో ఇచ్చినా, అసలు వర్షాల్లేకపోవడంతో ప్రభుత్వానికి పేరులేకుండా పోతోందని నిరంజన్‌ రెడ్డి దిగులుపడుతున్నారట. అంతేకాక లక్ష రూపాయల రుణమాఫి విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు వర్షాలు లేవు. రైతుల పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో, తమను ఆదుకోవాలని రైతులు వస్తే, ఏం సమాధానం చెప్పాలని తన సన్నిహితుల వద్ద మంత్రి మధనపడుతున్నారని సెక్రటెరియట్‌లోని అధికారులు చర్చించుకుంటున్నారు. వ్యవసాయ మంత్రి పదవి చేపట్టిన తొలి ఏడాదిలోనే, ఇలా వర్షాభావ పరిస్థితులు రావడం, సెంటిమెంట్ పరంగా కూడా ఆందోళన చెందుతున్నారట వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories