ఖైరతాబాద్ చరిత్రలో తొలిసారి మట్టి గణపతి

Matti Ganapathi for the First time in the History of Khairatabad
x

ఖైరతాబాద్ చరిత్రలో తొలిసారి మట్టి గణపతి

Highlights

Khairatabad: 50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు

Khairatabad: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా గణనాథులు కొలువుదీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం ఫేమస్. గణేష్ నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ భారీ గణనాథుడు పూజలందుకోనున్నాడు. తొలి పూజకు గవర్నర్ తమిళిసై హాజరవుతారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మహాగణపతికి గవర్నర్‌ తమిళిసై తొలిపూజ చేస్తారు.

ఈసారి 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు దీరారు. భక్తులకు లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేష్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories