Adilabad: ఆమెకు 28.. అతడికి 20.. కట్ చేస్తే.. పంట పొలాల్లో..

Lovers Brutally Murdered Over Extra-Marital Affair in Adilabad
x

Adilabad: ఆమెకు 28.. అతడికి 20.. కట్ చేస్తే.. పంట పొలాల్లో..

Highlights

Adilabad: తెలంగాణలో జంట హత్యలు కలకలం రేపాయి.

Adilabad: తెలంగాణలో జంట హత్యలు కలకలం రేపాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివారులోని పంట పొలాల్లో రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. మృతులు ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కు చెందిన రెహమాన్(20) కేఆర్ నగర్ కు చెందిన అశ్విని(28)గా గుర్తించారు. మృతులు ఇద్దరూ శుక్రవారం ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలోని శివారు పంటపొలాల్లోకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. వారు పంట పొలాల్లోకి వెళ్లిన తర్వాత హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరి హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని ప్రాథమిక నిర్థారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..హతురాలు అశ్వినికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విభేదాలు రావడంతో అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో పుట్టింట్లో ఉంటున్న అశ్వినికి రెహమాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ ద్విచక్రవాహనం పై సీతాగోందిలోని శివారు పంటపొలాల్లోకి వెళ్లగా వీరిని ఓ కారు అనుసరించినట్లు సీసీ ఫుటేజ్ లో బయటపడింది. కారులో ఉన్న దుండగులే అశ్విని, రెహమాన్ లను బండతో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అశ్విని భర్త తరపు బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు మరోవైపు డాగ్ స్వ్కాడ్ ను రప్పించి మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

వివాహేతర సంబంధాల కారణంగా తెలంగాణలో పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నాయి. అనుమానంతో భార్యను పిల్లలను చంపుతున్న భర్తలు, వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయడం, భర్త మరో స్త్రీతో ఎఫైర్ పెట్టుకొని భార్యను కడతేర్చడం ఇలాంటి ఘటనలు తెలంగాణలో తరచుగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఎన్నో హత్యలకు ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగానే దేశవ్యాప్తంగా ఏటా 3వేలమంది హత్యకు గురవుతున్నారు. కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు చేజేతులా తమ పిల్లల బతుకులను ధ్వంసం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories