KTR: సీట్లు.. ఓట్లు.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?

KTR Comments on Congress Govt
x

KTR: సీట్లు.. ఓట్లు.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?

Highlights

KTR: ప్రజాపాలన అంటే ఫక్తు రాజకీయమేనా?

KTR: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులను చిన్న చూపు చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీల్లోల రైతుల కన్నీళ్లూ కనిపించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అంటూ ప్రశ్నించారు.

సీట్లు.. ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా ఆదుకోరా అన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై ఎందుకు పెట్టరన్నారు. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగు నీరు ఇవ్వడం చేతకాలేదు.. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసలు రావడం లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories