CM KCR: మోరంచపల్లిలో హెలికాప్టర్‌తో సహాయక చర్యలు.. కేసీఆర్‌ ఆదేశాలు

KCR Ordered CS To Send Helicopter To Submerged Moranchapalli For Save People
x

CM KCR: మోరంచపల్లిలో హెలికాప్టర్‌తో సహాయక చర్యలు.. కేసీఆర్‌ ఆదేశాలు

Highlights

CM KCR: హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సీఎం ఆదేశం

CM KCR: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో భారీగా వర్షం కురుస్తుంది. కొన్నిచోట్ల 62 సెంటీమీటర్ల వర్షపాతం, మరికొన్ని చోట్ల 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలట్రీ అధికారులతో.. సీఎస్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే మోరంచపల్లికి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, NDRF బృందాలు చేరుకున్నాయి. జిల్లా అధికారులను సంప్రదిస్తూ పరిస్థితిని నివేదిస్తున్నారు సీఎస్.

Show Full Article
Print Article
Next Story
More Stories