కేసీఆర్ స‌ర్కార్ కీలక నిర్ణయం..తెలంగాణ‌లోనూ ఆయుష్మాన్‌ భారత్‌ అమలు

kcr Government decided to impliment ayushman bharat in telangana
x

కెసిఆర్ ఫైల్ ఫోటో 

Highlights

Ayushman Bharat in Telangana: కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Ayushman Bharat in Telangana: కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కంలో చేరాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయుష్మాన్‌ భారత్‌ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారుచేసింది. అందుకు అనుగుణంగా నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సీఈవోకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ విధివిధానాల ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించిన మార్గద‌ర్శ‌కాలు ఖ‌రారు చేశారు. ఈ ప‌థ‌కం నియమ నిబంధనలను అనుసరిస్తూ ...రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఆయుష్మాన్‌ భారత్ ప‌థ‌కాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వం 2018 సెప్టెంబర్‌లో రాంచీలో లాంఛనంగా ప్రారంభించినంది. హరియాణాలోని కర్నాల్‌లో జన్మించిన కరిష్మా అమ్మాయి ఈ ప‌థకంలో తొలి ల‌బ్ధిదారు.దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఈ ప‌థకం దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా అతి పెద్ద ఆరోగ్య బీమా అని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ ప‌థ‌కంలో చేరిన వారు ఆనారోగ్యం చెంది ఆస్ప‌త్రిలో చేరితే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు చికిత్స ఖ‌ర్చును కేంద్ర ప్ర‌భుత్వం కేటాయిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories