Sircilla: ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా..

Innovative Idea By SP Akhil Mahajan In Sircilla
x

సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వినూత్న ప్రయోగం

Highlights

* 6303922572 నెంబర్‌ను కేటాయించిన ఎస్పీ

Sircilla SP: పోలీసులకు పిర్యాదు చేయాలంటే భయపడే బాధితుల కోసం వినూత్న ప్రయోగం చేస్తున్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. ఒక్క మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చంటూ.. మెసేజ్‌ యువర్‌ ఎస్పీ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఇందుకు ఓ వాట్సాప్ నంబర్‌ కేటాయించి.. ఆ వాట్సాప్‌ను ఎస్పీనే పరిశీలిస్తున్నారు. తమ ఇబ్బందులపై బాధితులు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే వెంటనే విచారణ చేసి కేసు నమోదు చేయనున్నట్టు ప్రకటించారు ఎస్పీ మహాజన్. ముఖ్యంగా లైంగిక ఇబ్బందులు, గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలు వయసు పైబడినవారికి ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుందని పోలీసులు చెబుతున్నారు.

వాట్సాప్‌లో చేసే మెసేజ్‌ నేరుగా ఎస్పీకి చేరుతుంది. స్వయంగా ఎస్పీనే మెసేజ్‌ను చదివి దర్యాప్తుకి అదేశిస్తారు. కేసు ఫాలో అప్ కూడా తన కార్యాలయం చేస్తుందంటున్నారు ఎస్పీ మహాజన్. ఈ సేవలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే 75కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కేవలం ఫిర్యాదులే కాకుండా పోలీసులకు అవసరమయ్యే సూచనలు కూడా స్వీకరిస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌ కేసులపై వేగంగా స్పందించేందుకు మెసేజ్‌ యువర్‌ ఎస్పీ ద్వారా ఇచ్చే ఫిర్యాదులు ఉపయోగపడుతాయంటున్నారు జిల్లా వాసులు. అయితే ఎమర్జెన్సీ సమయాల్లో వాట్సాప్‌ మెసేజ్‌తో పాటు డయల్‌ 100ని ఖచ్చితంగా ఉపయోగించాలంటున్నారు ఎస్పీ మహాజన్.



Show Full Article
Print Article
Next Story
More Stories