Congress: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక

Huzurabad By-Elections Tension to Telangana Congress
x

తెలంగాణ కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Congress: టీఆర్ఎస్‌లో చేరిన గత కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి

Congress: హుజూరాబాద్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీకి బలమైన అభ్యర్దులు లేకపోవడంతో కొండా సురేఖపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఐతే, హుజూరాబాద్‌లో పోటీ చేయాలంటే తన డిమాండ్లను నెరవేర్చాలని షరతు పెట్టింది కొండా సురేఖ. దీంతో హస్తం పార్టీ అధినేతకు కొండా దంపతులు వ్యవహారం తలనొప్పిగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో హుజురాబాద్ ఉప ఎన్నిక తనొప్పిగా మారుతోంది. గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో హస్తం పార్టీ‌కి అక్కడ బలమైన అభ్యర్ది కరువయ్యారు. స్థానికంగా పత్తి క్రిష్టారెడ్డి లాంటి వాళ్లు ఉన్నా హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీని ఢీ కొట్టే స్థాయిలో అభ్యర్ది లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కొండా సురేఖను రంగంలో దించాలని యోచించారు. అధిష్టానానికి సైతం ఆమె పేరును ప్రతిపాదించినట్లు పార్టీలో చర్చ జరిగింది.

అయితే నిన్న మొన్నటి వరకు సైలెంటుగా ఉన్న సురేఖ ఒక్కసారిగా తన మౌనాన్ని వీడింది. వరంగల్‌ ఈస్ట్ దళిత, గిరిజన సభలో తన డిమాండ్లు పార్టీకి వినిపించేలా ప్రకటన చేసింది. తాను హుజూరాబాద్‌లో పోటీ చేయాలంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు తన భర్త మురళి, కుమార్తెకు కలిపి మూడు టిక్కట్లు ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. పార్టీలో ఒకే కుటుంబానికి ఒక్కటే టిక్కెట్టు అనే విదానానికి కొండా దంపతులు తూట్లు పొడిచే.. కోరికలు కోరుతున్నారని వారి డిమాండ్లపై మౌనం వహిస్తున్నారు కాంగ్రెస్‌ పెద్దలు.

Show Full Article
Print Article
Next Story
More Stories