hmtv కథనానికి స్పందన: కానిస్టేబుల్‌, హోంగార్డును సస్పెండ్‌ చేసిన ఎస్పీ

hmtv Effect: 2 Cops Suspended for Attacking Driver at Sadashivpet
x

hmtv కథనానికి స్పందన: కానిస్టేబుల్‌, హోంగార్డును సస్పెండ్‌ చేసిన ఎస్పీ

Highlights

hmtv: సంగారెడ్డి జిల్లాలో డీసీఎం డ్రైవర్ పై దౌర్జన్యంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.

hmtv: సంగారెడ్డి జిల్లాలో డీసీఎం డ్రైవర్ పై దౌర్జన్యంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. డీసీఎం డ్రైవర్ ను బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్ రాములు, హోంగార్డు బాలరాజును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దాడిలో పాల్గొన్న ఎఎస్ఐ దుర్గయ్య, మరో కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు.

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బొలేరో వాహనం డ్రైవర్‌ పట్ల దారుణంగా ప్రవర్తించారు. మానవత్వాని మరిచి అమానుషంగా వ్యవహరించారు. బూటు కాలితో తంతూ, లాఠీలతో చితకబాదుతూ ఆ డ్రైవర్ పై తమ ప్రతాపం చూపారు. సదాశివపేటకు చెందిన వాజీద్‌ బొలెరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామిగుడి దగ్గర పోలీసులు, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వాజీద్‌ను వెహికల్‌ పక్కకు తీయాలని కోరారు. తన వాహనాన్ని కొంత ముందుకు తీసుకెళ్లి ఆపాడు వాజీద్‌. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్‌ వాజీద్‌ను దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టాడు. నడిరోడ్డుపై నలుగురు పోలీసులు కలిసి ఓ డ్రైవర్ పై తమ ప్రతాపం చూపారు. బూటు కాలితో తన్నాడు. ఈ ఘటనలో వాజీద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఓ వైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం, పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ‎

Show Full Article
Print Article
Next Story
More Stories