తెలంగాణ ఆర్టీసీ బస్సులకు పోటెత్తుతున్న మహిళలు

Heavy Rush at RTC Bus Stands
x

తెలంగాణ ఆర్టీసీ బస్సులకు పోటెత్తుతున్న మహిళలు

Highlights

Telangana: ప్రభుత్వం ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టడంతో బస్సుల్లో రద్దీ

Telangana: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకంపై మహిళల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్రంలోని దాదాపు ప్రతి బస్టాప్‌లో కూడా మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఓ బస్సులో ఎక్కడానికి మహిళలు భారీగా గుమిగూడారు. బస్సు ఎక్కేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు.

బస్సు రెగ్యులర్ డోర్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరు అతివలు బస్సుకు అటువైపు ఉండే డ్రైవర్ సీటెక్కి లోపలికి వెళుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు పోటెత్తుతుండడంతో బస్టాప్‌లన్నీ రద్దీగా మారుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories