ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Heavy Rain forecast for AP and Telangana
x

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Highlights

Rains in AP Telangana: వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వానలు

Rains in AP Telangana: తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రకు నేడు భారీ వర్ష సూచన చేసిన వాతావరణశాఖ వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వానలు పడతాయని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టంచేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు స్పష్టం చేశారు. నారాయణపేట, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారుల వెల్లడించారు. మరోవైపు భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా నదుల పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

ఇక ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో.. కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రెండు మూడు రోజుల్లో అవి భారీ వర్షాలుగా మారతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories