రాష్ట్రంలో తొలి రైతు వేదిక నిర్మాణం పూర్తి

రాష్ట్రంలో తొలి రైతు వేదిక నిర్మాణం పూర్తి
x
రైతు వేదిక
Highlights

First Rythu Vedika In Telangana : రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం గురించి అదే విధంగా, వారు పండించే పంటల గురించి చర్చించుకోవడానికి అనుగుణంగా అదే విధంగా...

First Rythu Vedika In Telangana : రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం గురించి అదే విధంగా, వారు పండించే పంటల గురించి చర్చించుకోవడానికి అనుగుణంగా అదే విధంగా ఆన్‌లైన్‌లో సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా విధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని జిల్లాల్లో మొత్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ వేదికలలో రైతులు సమావేశాలు చేసుకోవడం మాత్రమే కాకుండా చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌ గానూ ఈ వేదికలను ఉపయోగించనున్నారు. ఇప్పటికే వీటిని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులను కూడా కేటాయించింది.

ప్రభుత్వం అందించిన ఈ నిధులతో మొట్ట మొదటి రైతు వేదికను సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో పూర్తి చేసారు. దీంతో ఇది రాష్ట్రంలోని తొలి రైతు వేదికగా ఇది గుర్తింపు పొందింది. తంగళ్లపల్లి రైతు వేదిక ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యింది. అయితే ఈ రైతు వేదికను అధికారులు ఆగస్టు 8న ఈ రైతు వేదిక ప్రారంభించాల్సి ఉండగా అనుకోకుండా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. రైతు వేదికను వ్యవసాయ ప్రాధాన్యాన్ని చాటేలా, రైతుల కోసం ప్రభుత్వ చేపడుతున్న పథకాల పట్ల అవగాహన కల్పించేలా చక్కటి డిజైన్లతో దీన్ని నిర్మించారు. లోపలి భాగంలోనూ ఈ ఇద్దరు నేతల ఫోటోలే కనిపించాయి. ఈ వేదిక గోడలపై ఓ వైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ ఫొటోలను గీయించారు. కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫొటోను మాత్రం ఈ వేదిక గోడలపై ఎక్కడా ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది రైతులు అసలైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఫొటో ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు తావు లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఫొటోలను కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.




Show Full Article
Print Article
Next Story
More Stories