MLC Kavitha: రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

ED will investigate MLC Kavitha on the second day
x

MLC Kavitha: రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Highlights

MLC Kavitha: విజయ్ నాయర్, పిళ్లై, కవితను కలిపి విచారించే చాన్స్

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను తొలిరోజు ఈడీ సెంట్రల్ కార్యాలయంలో విచారించిన ఈడీ... ఇవాళ రెండో రోజు విచారించనున్నది. విజయ్ నాయర్, పిళ్లై, కవితను కలిపి విచారణ చేసే అవకాశం ఉంది. నిన్న ఢిల్లీ ఈడీ సెంట్రల్ ఆఫీసులో కవితను విచారించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ భాను ప్రియ మీనా ఆధ్వర్యంలో రెండు బృందాలుగా కవితను ప్రశ్నించారు. రామచంద్రన్ పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ.. మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్ర స్టేట్ మెంట్ల ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. తొలిరోజు విచారణలో ఈడి ఆధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ మద్యం పాలసీలో టెండర్ల కోసం వంద కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరెవరు సమకూర్చారు వంటి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది.

కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి మరీ ఈడి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత కొన్నింటికి సమాధానం ఇచ్చి... మరికొన్నింటికి మాత్రం మౌనంగా ఉన్నారని సమాచారం.కోర్టు ఆదేశాలతో అధికారులు కవిత విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. మొదటి రోజు ఈడీ విచారణ తర్వాత కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులతో పాటు కవిత తరపు న్యాయవాదులు మోహిత్ రావు, వజీ షఫీలకు అనుమతి ఇచ్చారు. భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు ఈడీ సెంట్రల్ ఆఫీసులు కవితను కలిసి మాట్లాడారు. ఏడు రోజుల పాటు విచారణ కొనసాగనున్నది. ఈనెల 23తో కవిత విచారణ ముగియనున్నది. ఈడీ సెంట్రల్ కార్యాలయంలోని ప్రత్యేక సెల్ లో కవితను ఉంచారు. ప్రతి రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటు రౌస్ అవెన్యూ కోర్టు కల్పించింది. ఇంటి నుంచి భోజనానికి కోర్టు ఓకే చెప్పింది.

ఇక ఇది ఇలా ఉండగా...కవిత అక్రమ అరెస్టును సవాల్‌ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో కంటెంప్ట్‌ అఫిడవిట్‌ వేయనున్నారు. ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఇప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం నిబంధనలను విరుద్ధమని కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు. ఇదే విషయంపై ఢిల్లీలో న్యాయవాదులో సంప్రదింపులు జరిపారు. కవిత తరుపున సీనియర్‌ లాయర్లు కపిల్‌ సిబాల్‌, రోహిత్గీ వాదనలు విన్పిస్తారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories