MP Arvind: బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ దోచుకుంటోంది.. రుణమాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు..

Dharmapuri Arvind In the Farmer Satyagraha Diksha at Nizamabad
x

MP Arvind: బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ దోచుకుంటోంది.. రుణమాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు..

Highlights

MP Arvind: తెలంగాణ ఖజానాలో డబ్బులు లేవని, రుణమాఫీ అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.

MP Arvind: తెలంగాణ ఖజానాలో డబ్బులు లేవని, రుణమాఫీ అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలపై నిజామాబాద్ ధర్నాచౌక్‌లో బీజేపీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు హాజరైన ఎంపీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి.. కమిషన్ పేరిట తప్పించుకుంటోందని ఆరోపించారాయన... కాంగ్రెస్ హయాంలో రైతులకు భరోసా లేదని, మద్దతు ధరపై 5 వందల బోనస్ ఇవ్వడం లేదని, రైతులు పంట నష్టపోయి నెలరోజులు గడిచినా పరిహారం ఇవ్వలేదని, ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ చేసిన తప్పులతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారాయన.. బీఆర్ఎస్ పార్టీ కంటే.. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దోచుకుంటోందని ఆరోపించారు. 15 వేల రైతు భరోసా ఇచ్చే అవకాశాలే లేవన్నారాయన... బడ్జెట్‌లో నిధులు పెట్టకుండా గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు... రాహుల్, సోనియా, రేవంత్ అవినీతి పరులని దుయ్యబట్టారు. తాము పసుపు ధర పెంచితే... కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories