CP Sajjanar Call to Donate Plasma: ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి : సీపీ సజ్జనార్ పిలుపు

CP Sajjanar Call to Donate Plasma: ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి : సీపీ సజ్జనార్ పిలుపు
x
CP Sajjanar call CORONA Recovered People To Donate Plasma
Highlights

CP Sajjanar call to Donate Plasma: రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా బారిన పడి కోలుకున్న బాధితులందరికీ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శుభాకాంక్షలు తెలిపారు.

CP Sajjanar call to Donate Plasma: రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా బారిన పడి కోలుకున్న బాధితులందరికీ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల మంది కరోనబారిన పడుతున్నారని వారిలో కొంత మంది అనేకమది వైరస్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్‌ రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు దానం చేసే 500 మి. లీ ప్లాస్మాతో మరో ఇద్దరు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు.

ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కరోనా బారిన పడి కోలుకుని ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారన్నారు. అలా ముగ్గురిని కాపాడి వారి కుటుంబాలను ఆదుకున్నామన్నారు. ప్లాస్మా దానం చేసినప్పటికీ 24 గంటలు నుంచి 72 గంటల్లో శరీరంలోకి ప్లాస్మా వచ్చి చేరుతుందని సజ్జనార్ తెలిపారు. ప్లాస్మా ఇవ్వాలనుకునే వారు ఎవరైనా ఫోన్ ద్వారా 9490617440కి సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.

ఇక పోతే రాష్ట్రంలో నిన్న 1,478 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 42,496కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 13,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 28,075కి చేరుకుంది. ఇక నిన్న ఏడుగురు కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 403 కి చేరుకుంది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 806 కేసులు ఉన్నాయి. ఇక మిగతా జిల్లాల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి 91, మేడ్చెల్ 82, సంగారెడ్డి 20, ఖమ్మం 18, కామారెడ్డి 31, వరంగల్ అర్బన్ 51, కరీంనగర్ 77, యదాద్రి భువనగిరి, మహబూబాబాద్ 11, పెద్దపల్లి 35, నల్గొండ 35, సిరిసిల్లా 27, నాగూర్ కర్నూల్ 23, జనగాం 10, సిద్దిపేట 8, సూర్యాపేట 20, నిజామాబాద్ 11, ఆసిఫాబాద్ 11, వికారాబాద్ 17, నారాయణపేట 14 లలో కేసులు నమోదు అయినట్టుగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories