తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. సెప్టెంబరు నెలాఖరునాటికి..

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. సెప్టెంబరు నెలాఖరునాటికి..
x
Highlights

corona is under control in telangana : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, హైదరాబాద్ లో కూడా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర హెల్త్...

corona is under control in telangana : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, హైదరాబాద్ లో కూడా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబరు నెలాఖరునాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. కొవిడ్‌పై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వరుస వర్షాల వల్ల సీజనల్ రోగాలు కూడా పెరిగాయి, సీజనల్ డీసీజ్ లకు వుండే లక్షణాలు కోవిడ్ కు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

సీజనల్ డీసీజ్ లను నిర్లక్ష్యం చేయొద్దు టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది అలుపెరగని యుద్ధం కరోనా పై చేస్తోందన్నారు. 2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది ఇప్పటివరకు కరోనా భారిన పడ్డారని తెలిపారు. కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకుంటాం, ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుందని పేర్కొన్నారు. బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ను దాదాపు అదుపులోకి తీసుకొచ్చామన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories