తెలుగు రాష్ట్రాల్లో కళ తప్పిన సంక్రాంతి

Corona Effect on Sankranthi Celebrations
x

Representational Image

Highlights

* పెరిగిన నిత్యవసర వస్తువుల ధరతో ఆవిరైన పండగ * ఆకాశానంటుతున్న పప్పులు, నూనెలతో పాటు వంట గ్యాస్ ధరలు * గతంలో వారం రోజుల ముందు నుంచే ఇళ్లల్లో పిండి వంటలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రతీఏటా ఏంతో ఘనంగా జరుపుకునే "సంక్రాంతి" పండగ ఈ సారి కళ తప్పింది పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

సంక్రాంతి పండుగ వేళ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి పప్పులు, నూనెలతో పాటు వంట గ్యాస్ ధరలు దినదినం పెరుగుతున్నాయి పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు కరోనా మహమ్మారి బారినుంచి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

సంక్రాంతి పండుగ వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే ఇండ్లలో పిండి వంటలు ఘుమఘుమలాడేవి ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు పిండి వంటలకు దూరమవుతున్నారు వంటనూనె ధరలు రోజు రోజుకు సలసలకాగుతున్నాయి 2 నెలల వ్యవధిలో ఏకంగా పల్లి, సన్ ఫ్లవర్ నూనెలు లీటరుకు 20 నుంచి 35 రూపాయల వరకు పెరిగింది. ఇక పప్పుల ధరలు చుక్కలనంటాయి ప్రతి పప్పు కిలో 15 నుంచి 35 రూపాయల వరకు పెరిగింది.

ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో అవస్థలు పడుతున్న ప్రజలకు వంటగ్యాస్ ధరలు మరిన్నిఆర్థిక సమస్యలు తెచ్చి పెడుతున్నాయి ప్రభుత్వం 2 నెలల వ్యవధిలో సిలిండర్ పై 40 నుంచి 50 రూపాయల వరకు పెంచడంతో పేదలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రస్తుతం ఆయా కంపెనీలకు చెందిన గ్యాస్ సిలిండర్ల ధర 720 నుంచి 740 రూపాయల మధ్యలో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలను ఇలా రకరకాల కారణాలతో పేద, మధ్య తరగతి జనం దూరమవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని నిత్యవసర వస్తువుల ధరలు తగ్గేలా చూడాలని సామాన్యులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories