టీపీసీసీ అధ్యక్షుడి రేసులో సీనియర్లు!

టీపీసీసీ అధ్యక్షుడి రేసులో సీనియర్లు!
x
Highlights

గత కొంత కాలం నుంచి టీపీసీసీ చీఫ్ మార్పుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త బాస్ కోసం హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది.

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి కోసం కసరత్తు జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ రాజీనామా చేయడంతో.. కొత్త అధ్యక్షుడి కోసం అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీకి ఉత్తమ్‌ రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో తదుపరి కాంగ్రెస్‌ రథసారధి ఎవరనే చర్చ.. రాజకీయ వర్గాల్లో మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడి రేసులో పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో టీపీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు.

గత కొంత కాలం నుంచి టీపీసీసీ చీఫ్ మార్పుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త బాస్ కోసం హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. పార్టీలోని పలువురు నేతలే విమర్శలు చేయడం ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories