Telangana: గ్రామాల అభివృద్ధి పై సీఎం కేసీఆర్ దృష్టి

KCR On Review Meeting
x

కెసిఆర్ ఫైల్ ఫోటో 

Highlights

Telangana:గ్రామ పంచాయతీల నిధులను, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana: గ్రామాల అభివృద్ధి పై దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. దాంతో పాటు మున్సిపల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ల అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామాల అభివృద్ధి పై ప్రభుత్వం లక్ష్యం ఏంటి..? వాచ్ థిస్ స్టోరీ.

గ్రామ పంచాయతీల నిధులను, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇకనుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభించనుంది. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మార్కెట్లు మహిళలకు అందుబాటులో ఉండే విధంగా తగు విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల గృహాల మీదుగా పోయే విద్యుత్ లైన్లను ప్రభుత్వ ఖర్చుతోనే మార్చాలని ట్రాన్స్ కో సీఎండీ ను సీఎం ఆదేశించారు.

అన్ని నూతన జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో కూడిన అదనపు పోలీసు స్టేషన్లు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. అలాగే, మహిళా పోలీసు విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం విధి విధానాలు ఖరారు చేసి జీవోలు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బి, ఇరిగేషన్, హోం, పంచాయతీ రాజ్ తదితర శాఖలకు సంబంధించి, పలు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు.

రైల్వే లైన్లు ఉన్న పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే దిశగా ఆర్వోబి (రైల్వే వోవర్ బ్రిడ్జిలు) అండర్ పాస్ ల నిర్మాణం, పలు పట్టణాల్లో రోడ్ల వెడల్పు, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు, నదులు కాల్వల మీద అవసరమైన చోట చెక్ డ్యాంల నిర్మాణం వంటి పనులను మంజూరు చేయించారు సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories