Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్‌ దగ్గర భారీ భద్రత

Check Post Arranged Near Nagarjuna Sagar Dam
x

నాగార్జునసాగర్ డ్యామ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Nagarjuna Sagar Dam: కొత్త బ్రిడ్జి సమీపంలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు * ఏపీ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

Nagarjuna Sagar Dam: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్‌ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కొత్త బ్రిడ్జి సమీపంలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య రగులుతున్నజల వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి జిల్లా ఎస్పీ రంగనాథ్‌ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్‌ దగ్గర తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్‌లో కనీస నీటి మట్టం 885 అడుగులకు పైగా ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. అయినప్పటికీ తెలంగాణ జెన్‌కో ఉన్నతాధికారులు మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్న జల విద్యుత్ కేంద్రంలో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పత్త చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జిల్లా ఎస్పీ రంగనాథ్ సారథ్యంలో ప్రత్యేక పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. నాగార్జునసాగర్ స్పెషల్ ఫోర్స్ సిఐ పవన్ కుమార్ తో కలిసి ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రధాన డ్యామ్‌ను పరిశీలించారు జిల్లా ఎస్పీ.

Show Full Article
Print Article
Next Story
More Stories