వికారాబాద్ జిల్లాలో బురిడీ బాబా నిర్వాకం.. కుంపటిలో బాలిక కాళ్లు కాల్చి...

Buridi Baba who burnt the legs of a girl in Kumpati under the name of exorcism in Vikarabad | Live News
x

వికారాబాద్ జిల్లాలో బురిడీ బాబా నిర్వాకం.. కుంపటిలో బాలిక కాళ్లు కాల్చి...

Highlights

Vikarabad: పరిగి మండలం నస్కల్ శివారులో బురిడీ బాబా నాటు వైద్యం...

Vikarabad: అమాయకుల బలహీనతలు,నమ్మకాలే టార్గెట్ గా బురిడీ బాబాలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ శివారులో ఓ బురిడీ బాబా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ధారూర్ మండలం కుక్కిందకు చెందిన 12ఏళ్ల బాలికకు భూత వైద్యం పేరుతో చుక్కలు చూపించాడు. కర్కషంగా కాళ్లు చేతులు నిప్పుల కుంపటి కాల్చాడు.

ఆ తర్వాత చేతులెత్తేశాడు. దీంతో చేసేదేమీ లేక తీవ్రగా గాయపడిన బాలికను వెంటనే వికారాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆపరేషన్ చేసిన వైద్యులు 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories