జాకీలతో బిల్డింగ్ లిఫ్టింగ్.. హన్మకొండ ఆత్మకూర్ లో 5 అడుగుల మేర లిఫ్టింగ్

Building lifting with jockeys in Hanamkonda | TS News
x

జాకీలతో బిల్డింగ్ లిఫ్టింగ్.. హన్మకొండ ఆత్మకూర్ లో 5 అడుగుల మేర లిఫ్టింగ్

Highlights

*జపాన్ టెక్నాలజీని ఉపయోగించిన వెంకటేశ్వర్లు

Hanamkonda: సాధారణంగా జాకీలను ఎందుకు వాడతామని అడిగితే బస్సు, లారీ పంచర్ అయితే లేదా ఇతర రిపేర్లకు పైకి ఎత్తడానికి అని సమాధానం చెప్తాము. ప్రతి ఒక్కరి కలలకు ప్రతిరూపం సొంతిల్లు. మారిన పరిస్థితుల వల్ల ఇంటిని కూల్చివేయాలంటే ఎవరికైన మనసు అంగీకరించదు. అందుకు అనుగుణంగా ఇల్లుని మార్చగలిగితే ఎవరికైనా అంతకు మించి హ్యాపి ఏముంటుంది...? ఇదే ఆలోచనకు పదును పెట్టాడు వెంకటేశ్వర్లు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇంటి ఎత్తును పెంచవచ్చని తెలుసుకుని పని మొదలు పెట్టాడు. హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలో ఒక వ్యక్తి తన ఇంటిని.. ఏకంగా ఐదు అడుగుల ఎత్తుకు లేపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇంటిని ఎత్తు లేపొచ్చనే టెక్నాలజీ ఏపీ నెల్లూరుకు చెందిన అనిల్ అనే వ్యక్తిని దగ్గర ఉండటంతో ఆయనను సంప్రదించారు. ఆత్మకూరులోని వెంకటేశ్వర్లు ఇంటిని పరిశీలించి పని మొదలు పెట్టారు. జపాన్ టెక్నాలజీతో 150 జాకీలు ఇంటి చుట్టూ అమర్చి, ఇంటిని ఐదు అడుగులు ఎత్తుకు లేపారు. జాకీలతో ఇంటిని లేపడం వల్ల ప్రస్తుతం మా ఇల్లు 5 అడుగుల ఎత్తులో ఉంది. ఇదే ఇల్లు కొత్తగా నిర్మాణం చేయాలంటే 50లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ ఈ టెక్నాలజీతో 10 లక్షలతో ఇంటి సమస్యను పరిష్కరించారు. జపాన్ టెక్నాలజీ పెద్ద నగరాలు, పట్టణాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కాగా ఈ టెక్నాలజీని వరంగల్ జిల్లా ఆత్మకూరులో మొదటి సారి ఉపయోగించారు.

జాకీలతో ఇల్లు ఎత్తు లేపడాన్ని మొదట్లో తాము కూడా వ్యతిరేఖించామని పలువురు వెంకటేశ్వర్లు సన్నిహితులు అన్నారు. కానీ జాకీలతో ఇంటిని లేపిన తరువాత తక్కువ ఖర్చుతోనే సమస్యను అధిగమించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక ఆలోచన లేని సమయంలో బిల్డింగ్ లిఫ్టింగ్ టెక్నాలజీని వినియోగించుకుని, తమ పాత ఇంటిని ఎత్తుకు లేపుకుంటున్న వైనం పరిశీలిస్తే సాంకేతికత గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తుందని అర్థమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories