Malware Attack: ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేయండి

Remove These 8 Apps Your SmartPhone Immediately
x

స్మార్ట్‌ఫోన్‌లో మాల్వేర్ యాప్స్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Malware Attack: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే వెంటనే డిలీట్ చేయాలని మొబైల్ రీసెర్చ్ సంస్ధ మెకాఫీ హెచ్చరిస్తోంది.

Malware Attack: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే వెంటనే డిలీట్ చేయాలని ప్రముఖ మొబైల్ రీసెర్చ్ సంస్ధ హెచ్చరిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసే ఈ ఎనిమిది యాప్స్‌ యూజర్లకు హాని చేసేలా ఉన్నాయని తెలిపింది. ఇలాంటి మాల్‌వేర్, యాడ్‌వేర్ యాప్స్ ను గూగుల్ గుర్తించి తొలగిస్తుంది.

తాజాగా మెకాఫీ సంస్థ మాల్‌వేర్ ఉన్న 8 ఆండ్రాయిడ్ యాప్స్‌ని గుర్తించింది. వాటి జాబితాను విడుదల చేసింది. ఈ యాప్స్ ఆగ్నేయాసియా, అరేబియన్ పెనిన్‌సులా ప్రాంతాలకు చెందిన యూజర్స్‌ని టార్గెట్ చేసినట్లు పేర్కొంది. వీటిని 7,00,00 పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారంట. వాల్‌పేపర్స్, ఫోటో ఎడిటర్స్, కీబోర్డ్ స్కిన్స్, పజిల్స్, కెమెరా యాప్స్ పేరుతో యూజర్లను ఆకర్షిస్తున్నాయంట.

అయితే మెకాఫీ సంస్థ వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. టెస్టింగ్ వర్షన్, అలాగే ఫస్ట్ వర్షన్‌ను గూగుల్ పంపే సమయంలో క్లీన్ గా ఉండేలా చూసుకుంటారంట. ఆ తరువాత అప్‌డేట్ పేరుతో మాల్‌వేర్ ను పంపిస్తున్నట్లు పేర్కొంది. మాల్ వేర్ ఉంటే గూగుల్ ప్లే స్టోర్ లో ఆటోమెటిక్ గా డిలీట్ చేస్తుంది. అందుకే ఇలాంటి యాప్స్ అప్‌డేట్స్ పేరుతో ఇలా యూజర్ల డేటాను తస్కరిస్తుంటాయని వెల్లడించింది. ఇలాంటి యాప్స్‌ను వెంటనే డిలీట్ చేసి, మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలని సూచించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories