Technology

భారీ కుంభకోణంతో ఫేస్‌బుక్ కుదేలు

Submitted by arun on Wed, 03/21/2018 - 14:24

మీ ఫేస్ బుక్ ఎకౌంట్ సేఫేనా... సరదాగా మీరు షేర్ చేసే మీ వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రం... ఫేస్ బుక్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే బుక్కైపోయినట్టేనా...? అవును ఇప్పుడు ఫేస్ బుక్ ఇరుక్కున్న స్కాం చూస్తే ఇలాంటి అనుమానాలు రాకతప్పదు.  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. అతి పెద్ద కుంభకోణంలో చిక్కుకుంది. ఆర్ధికంగా తీవ్ర నష్టాలబాట పట్టడంతోపాటు సంస్థ విశ్వసనీయత భారీగా దెబ్బతినే ప్రమాదం వచ్చిపడింది.

4జీ మాత్రమే కాదు.. 5జీలోనూ జియో సంచలనం!

Submitted by arun on Sat, 03/17/2018 - 11:19

జియో నెట్ వర్క్.. దేశాన్ని ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జియో వచ్చాకే.. అట్టడుగు వర్గాలకూ.. అద్భుతమైన స్పీడ్ తో ఇంటర్ నెట్ సేవలు అందడం మొదలైంది. జియో దెబ్బకు ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కూడా ధరలు తగ్గించి వినియోగదారులను తమ నెట్ వర్క్ వాడాలంటూ బతిమాలాల్సి వస్తోంది. ఇప్పడిప్పుడే ఇతర నెట్ వర్క్ లు.. జియో దెబ్బ నుంచి కొలుకుంటున్నాయంటే.. ఇన్నాళ్లూ జియో ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

వాట్సాప్ లో ఈ ఫీచర్ గురించి తెలుసుకున్నారా?

Submitted by arun on Tue, 03/06/2018 - 10:55

వాట్సాప్ లేనిదే.. మనకు తెల్లారదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా.. చెప్పిన విషెస్ కు రిప్లై చూసుకోవాలన్నా.. కొత్త అప్ డేట్స్ తెలుసుకోవాలన్నా.. ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారన్న స్టేటస్ తెలుసుకోవాలన్నా.. అంతా ఇప్పుడు వాట్సాప్ మయమే అయిపోయింది. ఇలా పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకూ.. అప్ డేట్స్ అన్నీ అందులోనే అప్ డేట్ అవుతున్నాయి.

Tags

చంద్రునిపై ఇగ్లూ ఇళ్లు

Submitted by arun on Fri, 03/02/2018 - 12:24

విశ్వాంతరాల్లోకి ప్రయాణించే క్రమంలో జాబిల్లిని మజిలీగా ఉపయోగించుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో సమాలోచనలు ప్రారంభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లా కృత్రిమ మజిలీ కాకుండా ఏకంగా చంద్రుడిపైనే ఆవాసాలు నిర్మించాలని భావిస్తోంది. 

మంచు ఖండంలో నిర్మించే ఇగ్లూల వంటి నిర్మాణాలను చంద్రుడిపై నిర్మించాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ప్రణాళికలు సిద్ధం కాలేదు. అంతా అనుకున్నట్లుగా జరిగితే రాబోయే కాలంలో భారతదేశం చేపట్టబోయే అతిపెద్ద సైన్స్ పోగ్రామ్ ఇదే అవుతుంది.

చంద్రుడిపై 4జీ నెట్ వర్క్

Submitted by arun on Thu, 03/01/2018 - 11:55

చందమామ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకవైపు మనదేశం చంద్రయాన్-2 పేరుతో చంద్రునిపై రోవర్ ను దించే పనిలో ఉంటే.. మరోవైపు ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఏకంగా అక్కడ 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది.

చంద్రుడిపై తొలిసారిగా 4జీ నెట్వర్క్ ఏర్పాటుకానుంది. వొడాఫోన్ - నోకియా భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ బృహత్ కార్యంలో ఆడి సంస్థ కూడా చేయి కలుపుతోంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే అద్భుతాలే సృష్టించవచ్చంటున్నారు అంతరిక్ష నిపుణులు. 

మొబైల్ నెంబర్లలో సంచలనాత్మక మార్పులు

Submitted by arun on Thu, 02/22/2018 - 10:43

ఇన్నేళ్లూ మొబైల్ నెంబర్ ఎంతంటే.. 10 అంకెలు చెబుతూ వచ్చాం. ఇక నుంచి 13 అంకెల నెంబర్ చెప్పాలి. అవును.. 2018, జూలై 1 నుంచి కొత్త సిరీస్ రాబోతోంది. కేంద్ర టెలికాం శాఖ సంచలన నిర్ణయం మేరకు జూలై 1 నుంచి కొత్తగా సిమ్ కార్డ్ తీసుకునే వారికి ఈ నెంబర్లు ఇస్తారు. మొబైల్ టూ మొబైల్ కస్టమర్లకు 13 అంకెల కొత్త సిరీస్ నెంబర్ ఇవ్వనున్నారు. అన్ని టెలికాం కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

విశ్వం గుట్టు విప్పే సరికొత్త అస్త్రం

Submitted by arun on Sat, 02/10/2018 - 15:04

అనంత రహస్యాలను తనలో ఇముడ్చుకున్న విశ్వం గుట్టు విప్పేందుకు.. పరిశోధకులు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం భూమీపైన అత్యంత భారీ టెలిస్కోపును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హవాయి ద్వీపంలో నిర్మాణాన్ని చేపట్టి 2026 లోగా కార్యాచరణకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ ఎక్స్ చరిత్ర...అంతరిక్షంలోకి కారును పంపిన స్పేస్ ఎక్స్

Submitted by arun on Fri, 02/09/2018 - 12:01

అంతరిక్ష పరిశోధనలు మరో మలుపు తిరిగాయి. ఇన్నాళ్లూ మూగజీవాలు.. ఆ తర్వాత వ్యోమగాములు వెళ్లిన స్పేస్ లోకి.. తొలిసారిగా ఓ కారును పంపించారు. ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకేట‌్  ఫాల్కన‌్ హెవీ ద్వారా.. టెస్లా రోడ్ స్టర‌్ మోడల్  కారును అంతరిక్షంలోకి పంపించింది. నాసా కీలక ప్రయోగాలకు వేదికైన కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచే ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే కారును నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో మాత్రం విఫలమయ్యారు. 

ఐటీ కి ఆటోమేషన్ ముప్పు

Submitted by lakshman on Thu, 02/08/2018 - 08:08

నిన్నటి వరకు ఉపాధికి కేరాఫ్ అడ్రగ్ మారిన ఐటీ జాబ్ మార్కెట్‌కి  ముప్పు ముంచుకొస్తోంది.. అదే ఆటోమేషన్. ఐటీ రంగంలో ఆటోమేషన్ దెబ్బకు 2021 నాటికి 6.4 లక్షల ఉద్యోగాలు గాయబ్‌  కానున్నాయి. ఇటీవల ప్రాఫిట్‌ మార్జిన్స్ తగ్గడంతో ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌ బాటపడుతున్నాయి. దీని ఎఫెక్ట్‌  ఐటీ ఉద్యోగాలపై పడనుందని అమెరికాకు చెందిన హెచ్‌ఎఫ్ఎస్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.

మ‌రో మైలు రాయిని అధిగమించిన మేఘా ఇంజనీరింగ్‌

Submitted by arun on Wed, 02/07/2018 - 17:42

యూపిలో ప్రారంభించిన ఏంఈఐఎల్‌ మేఘా ఇంజనీరింగ్‌.. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. గడిచిన 25 ఏళ్లుగా హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పడి దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తూ, మౌళిక వసుతుల నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేసుకుంటు వెళ్తున్న మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. నిర్మాణ రంగంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు మొదలైన వాటిలోనే కాకుండా విద్యుత్‌ సరఫరా రంగంలోనూ తనదైన ప్రతిభను చాటుకుంది.