KTR

బాబు చేతిలో మహాకూటమి జుట్టు ..గెలిస్తే తెలంగాణకు గుండు...

Submitted by arun on Tue, 10/23/2018 - 14:19

మహాకూటమిపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి జుట్టుంతా చంద్రబాబు చేతిలో ఉందని  అధికారం కట్టబెడితే గుండు కొడతాడంటూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇబ్రహీం పట్నం ప్రాంతాన్ని ఫార్మా హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  
 

యువతే లక్ష్యంగా టీఆర్ఎస్‌ ఎన్నికల ప్రచారం ...రంగంలో దిగిన...

Submitted by arun on Mon, 10/15/2018 - 10:29

పెట్టుబడి సాయంతో రైతులను, బతుకమ్మ చీరలతో మహిళల్లో ఆదరణ పొందిన టీఆర్ఎస్ యూత్‌ను ఆకట్టుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. కోడ్ అమల్లో ఉండటంతో  తాము గతంలో చేపట్టిన పథకాలను వివరిస్తూ కొత్త పంథాలో ముందుకు వెళుతోంది. ఏక కాలంలో బహుళ ప్రయోజనాలు పొందేలా అటు యూత్ ఇటు వీరి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా క్షేత్రస్ధాయి ప్రచారం ప్రారంభించింది.   

ఎన్నికల వేల స్పీడ్ పెంచిన కారు...కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న 14 నియోజక వర్గాల ఆశావాహులు

Submitted by arun on Thu, 10/11/2018 - 10:55

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష ముమ్మరం చేసింది వివిధ నియోజక వర్గాల్లోని కాంగ్రెస్, టీడీపీ క్యాడర్‌ను కారెక్కిస్తోంది కేటీఆర్ స్వయంగా గులాభి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మరోవైపు పద్నాలుగు నియోజక వర్గాల ఆశావాహులతో కేటీఆర్‌ను కలిసి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. 

ఆంధ్ర యువకుడి పనికి కేటీఆర్‌ ఫిదా

Submitted by arun on Mon, 10/08/2018 - 13:55

టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని తాజాగా కేసీఆర్‌పై అభిమానంతో ఓ యువకుడు  విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. నెలూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి కేటీఆర్ వీరాభిమాని. తన గుండెపై కేటీఆర్ రూపాన్ని టాటూగా వేయించుకున్నాడు. గులాబీ దుస్తుల్లో విజయవాడ నుంచి కాలినడకన హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే ఆ యువకుడు చేసిన పనికి మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ట్వీటర్‌ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు.

బావా బావా పన్నీరు.... మేమంతా ఒకటే చూడు!!

Submitted by santosh on Fri, 10/05/2018 - 11:46

ఇద్దరి మధ్యా విభేదాలన్నారు. రెండు వర్గాలున్నారు. ప్రచ్చన్న యుద్ధమన్నారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం కోసం పోటీ అన్నారు. ఎన్నికల్లో గులాబీదళం చీలిపోవడం ఖాయమని విపక్షాలు జోస్యం చెప్పాయి. పోతూపోతూ బావబామర్దుల మధ్య బాంబేశారు కొండా సురేఖ. కానీ అలాంటి ప్రచారాన్ని వారిద్దరూ తిప్పికొట్టారు. అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేశారు. ఒకే వేదికపై పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. ఒకరి గెలుపును మరొకరు ఆకాంక్షించుకున్నారు. 

Tags

బావా నువ్వు సూపర్

Submitted by arun on Fri, 10/05/2018 - 10:46

ఇద్దరి మధ్యా విభేదాలన్నారు. రెండు వర్గాలున్నారు. ప్రచ్చన్న యుద్ధమన్నారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం కోసం పోటీ అన్నారు. ఎన్నికల్లో గులాబీదళం చీలిపోవడం ఖాయమని విపక్షాలు జోస్యం చెప్పాయి. పోతూపోతూ బావబామర్దుల మధ్య బాంబేశారు కొండా సురేఖ. కానీ అలాంటి ప్రచారాన్ని వారిద్దరూ తిప్పికొట్టారు. అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేశారు. ఒకే వేదికపై పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. ఒకరి గెలుపును మరొకరు ఆకాంక్షించుకున్నారు. 

కేటీఆర్‌తో పోటీ పడతా : హరీశ్‌ రావు

Submitted by arun on Thu, 10/04/2018 - 17:21

కేటీఆర్ పనితీరుపై హరీశ్‌రావు ప్రశంసలు గుప్పించారు. హైదరాబాద్‌లో సిరిసిల్ల నియోజకవర్గ కీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో  కేటీఆర్, హరీశ్‌రావులు పాల్గొన్నారు.. ఆత్మహత్యల సిరిసిల్ల, సిరుల ఖిల్లాగా మారిందంటే.. పూర్తి క్రెడిట్ కేటీఆర్‌దేనని పొగడ్తలు గుప్పించారు. అభివృద్ధి విషయంలో మాత్రం కేటీఆర్, తాను పోటీ పడతామని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు సాగాలని హరీశ్‌ తెలిపారు. మెజారిటీ విషయంలో సిరిసిల్ల సిద్దిపేటను దాటాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి హరీష్ రావు కి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Tags

కొండా దంపతుల విమర్శలను తిప్పికొట్టిన కేటీఆర్

Submitted by arun on Wed, 09/26/2018 - 10:22

కొండా దంపతుల విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. కొండా సురేఖ, మురళి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు పోతూ పోతూ రాళ్లు వేయడం సహజమేనని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కొండా దంపతులు తనపై, పార్టీపై చేసిన ఆరోపణలపై పరోక్ష విమర్శలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు పోతూ పోతూ రాళ్లు వేయడం సహజమేనని అన్నారు. టీఆర్ఎస్‌పై విమర్శలు చేసి అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఎవరికి ఎంత బలం ఉందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు: కేటీఆర్‌

Submitted by arun on Tue, 09/25/2018 - 11:04

ఢిల్లీ గులాములుగా ఉండాలా? అమరావతి బానిసల్లా ఉండాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన తరుణమిదన్నారు మంత్రి కేటీఆర్‌. అమరవీరుల గురించి మాట్లాడుతున్న కోదండరామ్‌... ఏ అమరుడు చెప్పాడని కోదండరామ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక్కటయ్యాయన్న కేటీఆర్‌... టీఆర్‌ఎస్‌... మోడీకో, రాహుల్‌కో భయపడే పార్టీ కాదన్నారు.

తెలంగాణకు అడ్డుపడ్డ రెండు గడ్డాలు ఒక్కటవుతున్నాయి; కేటీఆర్

Submitted by arun on Thu, 09/13/2018 - 10:08

ఎన్నికల వేళ వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్ నేత సురేష్‌ రెడ్డి హస్తం వీడి, కారెక్కగా, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ సహా పలువురు నాయకులు హస్తం గూటికి చేరారు. సురేష్ రెడ్డి చేరిక సమయంలో, కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ కాకరేపుతున్నాయి.