elections

తెలంగాణలో మొదలైన ఎన్నికల బెట్టింగ్‌

Submitted by arun on Sat, 11/03/2018 - 14:52

అన్ని పార్టీలలో అభ్యర్ధుల ఖరారు కాకాముందే అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బెట్టింగ్‌ల జోరందుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, అభిమానుల మధ్య జోరుగాబెట్టింగ్‌లు మొదలైనయి.సుద్దాల, క్యాతన్‌పల్లి గ్రామాల్లో ఇరు పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్‌లు పందెం పెట్టుకున్నారు. కాగా చెన్నూరులో టీఆర్ఎస్‌ అభ్యర్థి బాల్కసుమన్‌పై కాంగ్రెస్ నేత వెంకటేశ్ ఎమ్మెల్యేగా గెలుస్తారని సుద్దాల మాజీ సర్పంచ్ పోలు చంద్రాగౌడ్ రూ.పది వేల బెట్ కట్టాడు.

టీడీపీ కోడ్ ఉల్లంఘనను పట్టించునేదెవరు?

Submitted by hmtvdt on Mon, 04/30/2018 - 11:42

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు సర్వం పూర్తయ్యాయి. ఏ ఉద్దేశంతో సభ నిర్వహిస్తున్నా కూడా.. టీడీపీ నేతలు మాత్రం ఓ విషయాన్ని మరిచిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తో పాటు.. ఇతర నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.

అన్నా రాంబాబు ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీచేయ‌లేరు..?

Submitted by hmtvdt on Tue, 04/24/2018 - 21:58

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేస్తారా..?  లేదా అనేది ఆ జిల్లా రాజ‌కీయాల్లో విసృత ప్ర‌చారం జ‌రుగుతోంది.   మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఒక మ‌హిళ‌పై జ‌రిగిన ఘ‌ర్ష‌ణ కేసులో ఐదు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌ప‌డింది. ప్ర‌స్తుతానికి బెయిల్ మీద ఉన్న ఆయ‌న .. పై కోర్టును ఆశ్ర‌యించారు. 

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

Submitted by arun on Sat, 02/24/2018 - 09:58

రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌- మే నెలల్లో ముగియనుంది. దీంతో శాసనసభ్యుల కోటా కింద జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించింది. 

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 16 రాష్ట్రాల్లో 58 స్థానాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 5న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. మార్చి 23న ఓటింగ్ నిర్వహించి అదే రోజున ఓట్లు లెక్కిస్తారు. 

రెండు రాష్ట్రాల్లో కచ్చితంగా పోటీ చేస్తాం: పవన్

Submitted by arun on Mon, 01/22/2018 - 17:56

కరీంనగర్‌లో నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ మాట్లాడుతూ.... తెలంగాణ‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలుసుకుంటానని చెప్పారు. తాను ఇరు రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు. అయితే, తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో ఆలోచించి అవగాహన తెచ్చుకున్న తరువాత ముందడుగు వేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. తెలంగాణ‌లోని స‌మ‌స్య‌ల‌పై త‌మ‌ బృందం అధ్య‌య‌నం చేస్తోందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని మరోసారి ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలకు ముందు ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది స్పష్టత వస్తుందని చెప్పారు. కార్యకర్తల సూచన మేరకు.. ఎక్కడ బలం ఉంది..

ఎవరు కొడితే ఈవీఎం బాక్సులు బద్దలవుతాయో...అతడే మోదీ

Submitted by lakshman on Mon, 12/18/2017 - 20:03

ఎవడు కొడితే ఈవీఎం బాక్సులు బద్దలవుతాయో...అతడే మోడీ. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చావగొట్టాడు. మహారాష్ట్ర, హర్యానా, యూపీ...ఇలా చాలా ఎన్నో రాష్ట్రాల్లో దిమ్మతిరిగే ఫలితాలు రాబట్టాడు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో రఫాడించే రిజల్ట్‌‌ కొల్లగొట్టాడు. తానే ఒక సైన్యంగా, ఒకే ఒక్కడుగా, బాహుబలిగా నరేంద్ర మోడీ అవతరించాడా...ఇక మోడీకి తిరుగులేదా...మోడీని ఢీకొట్టే మొనగాడే పుట్టలేదా...పుట్టబోడా....నరేంద్ర మోడీ, బలశాలిగా ఎలా అవతరించాడు?

వైసీపీలో కలకలం

Submitted by lakshman on Sun, 12/17/2017 - 16:23

వైసీపీలో కలకలం మొదలైంది. నిన్నమొన్నటి వరకు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ వైసీపీ మరోసారి ఇదే తరహ సమస్యని ఎదుర్కొనబోతుందని పొలికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఏపీలో ముదిరిన ముందస్తు రాజకీయం

Submitted by lakshman on Tue, 09/12/2017 - 21:09
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముందస్తు ఎన్నికల వైపు పరుగులు తీస్తోందా? 2018 డిసెంబర్‌లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయా? ఏపీలో అధికారప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి...