PM Modi

ఈ ఐదుగురు దేశంలో ఫేమ‌స్ ఛాయ్ వాలాలు

Submitted by lakshman on Mon, 02/19/2018 - 23:31

 అర్షద్ ఖాన్ : నెటిజన్ లకు ఈ పేరు పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే పాక్ లో నీలి కళ్ల రంగుతో, ఛాయ్ తయారు చేస్తూ అర్షద్ ఖాన్ ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే ఆ ఒక్క ఫోటోనే అతని జీవితాన్ని మార్చేసింది. ఛాయ్ వాలా నుంచి మోడల్ గా మారిపోయాడు. అంతేకాదు మోడల్ గానే కాకుండా కబీర్‌ అనే సినిమాలో హీరో సోదరుడిగా వెండితెరపై వెలిగిపోతున్నాడు. ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా నో చెప్పిన అర్షద్ ఖాన్.. కబీర్ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్వల్ ఇచ్చేశాడు
 

పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు

Submitted by arun on Wed, 02/07/2018 - 13:23

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ... కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

ఆత్మగౌరవం దెబ్బతిన్నందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి..: మోదీ

Submitted by arun on Wed, 02/07/2018 - 13:15

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ... కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు లేచి చప్పట్లు కొట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అందరి ముందు అవమానించారని మోదీ అన్నారు.

గుజరాత్‌లో నైతిక విజయం మాదే: రాహుల్‌

Submitted by arun on Tue, 12/19/2017 - 14:53

గుజరాత్‌ ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. గుజరాత్‌లో బీజేపీ గెలిచినా నైతికంగా తామే విజయం సాధించామని స్పష్టం చేశారు.  ‘గుజరాతీయులు నా పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించారు. భాజపా నేతలు గుజరాత్‌ మోడల్‌ అని ప్రచారం చేశారు. మూడు నెలల క్రితం గుజరాత్‌ వెళ్లినపుడు భాజపా ముందు కాంగ్రెస్‌ నిలబడలేదన్నారు. కానీ ఇప్పుడు భాజపాకు గట్టి పోటీ ఇవ్వగలిగాం. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి’. ఎన్నికల ప్రచారంలో కులాలు, మతాల గురించి మాట్లాడిన మోడీ అమిత్‌ షా కొడుకు జే షా గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

అధ్యక్షుడిగా తొలి ప్రసంగం‌.. మోదీపై నిప్పుల వర్షం!

Submitted by arun on Sat, 12/16/2017 - 13:50

కాంగ్రెస్‌లో నవ శకం ప్రారంభమైంది. 19 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త అధినేత వచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో వేడుకగా జరిగిన పట్టాభిషేకం కార్యక్రమానికి సోనియా, మన్మోహన్‌తో పాటు ప్రియాంక దంపతులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్ 49 వ అధ్యక్షుడు. అలాగే నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి పార్టీ పగ్గాలు అందుకున్న వారిలో ఆరో వ్యక్తి.