Congress party

కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు..

Submitted by arun on Thu, 10/11/2018 - 15:49

కాంగ్రెస్‌ పార్టీకి క్యాడర్‌ లేదని, టీటీడీపీకి లీడర్‌ లేరని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ నేత కేటీఆర్‌. సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. కరువు కోరల్లో ఉన్న సిరిసిల్లను మూడేళ్లలో అభివృద్ధిలోకి తెచ్చామని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సిరిసిల్లను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లేనని కేటీఆర్‌ చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటయ్యాయని, కేసీఆర్‌‌ను గద్దె దించడమే లక్ష్యమంటున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కేటీఆర్ అన్నారు. 

అవునా... కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులున్నారా? హన్మన్న అలా అన్నారేంటి?

Submitted by santosh on Fri, 09/21/2018 - 10:27

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎన్నికల కమిటీలు, ఆ పార్టీలో నిద్రాణంగా ఉన్న అసంతృప్తి సెగలను రాజేశాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్ నేతలు, నోటికి పని చెప్పారు. ఎన్నికల ముంగిట్లో సమరోత్సాహంతో వెళ్లాల్సిందిపోయి, సంచలన వ్యాఖ్యలతో పార్టీల్లో కల్లోలం రేపుతున్నారు.

ఎట్టకేలకు రాజకీయ మౌనం వీడిన విజయశాంతి

Submitted by arun on Tue, 09/18/2018 - 08:52

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి ఎట్టకేలకు మౌనం వీడారు. 2014 ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేని విజయశాంతి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీకాంగ్రెస్‌ ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. సీనియర్ లీడర్లు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మధుయాష్కీ, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిపి ఒక టీమ్‌గా కమిటీ వేస్తే ప్రభావముంటుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

టీడీపీలో పొత్తుల కలకలం...అయ్యన్న, కేఈపై చంద్రబాబు ఆగ్రహం

Submitted by arun on Sat, 08/25/2018 - 07:46

తెలుగుదేశం పార్టీలో పొత్తుల తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. మంత్రులు కేఈ, అయ్యన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిట్‌ బ్యూరోలో చర్చించకుండా పొత్తులపై ఎలా మాట్లాడతారంటూ సీరియస్‌ అయ్యారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సీనియర్‌ మంత్రులు స్పందించడం తగదన్న చంద్రబాబు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. 

టార్గెట్‌ అంటూ.. పెళ్లికి టాటా చెప్పేసిన రాహుల్‌

Submitted by arun on Wed, 08/15/2018 - 11:06

సొట్టుబుగ్గల కుర్రాడి సొగసు తగ్గుతోంది. ఏజ్‌ బార్‌ అవుతోంది. లక్ష్యం సాధించిన తర్వాతే పెళ్లి గిల్లీ అంటూ జోకులేసిన రాహుల్‌ చివరకు పెళ్లి సంగతి తేల్చిచెప్పేశారు. 49 ఏళ్లు వస్తున్నాయి. అది కూడా వచ్చే ఏడాదికి దాటబోతోంది. మరి ఇంకెన్నాళ్లు.? మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అసలు పెళ్లి చేసుకోరా? ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ పునర్వైభవం కన్నా యువరాజా వారి పెళ్లే హాట్‌టాపిక్‌ మారింది. ఇంతలోనే రాహుల్‌ బాంబు పేల్చేశారు.

మిషన్ - 2019...ఏపీకి ప్రత్యేక హోదా

Submitted by arun on Mon, 07/23/2018 - 10:34

కేంద్రంలో బీజేపీ సర్కారుకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికలు, పొత్తులు, ప్రచార కమిటీ బాధ్యతలను రాహుల్‌కే అప్పగించిన వర్కింగ్ కమిటీ ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా కూలంకషంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా: బైరెడ్డి

Submitted by arun on Sat, 07/21/2018 - 12:01

ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని అది కాంగ్రెస్‌తోటే సాధ్యమని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలు బీజేపీతో కుమ్మక్కై తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయన్నారు బైరెడ్డి. శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ లో  చేరనున్నారు. కర్నూల్‌ జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి రాయలసీమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించిన విషయం తెల్సిందే!

అక్కడి నుంచే తెలంగాణకు రెండో సీఎం

Submitted by arun on Mon, 07/16/2018 - 17:18

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేసిన సోనియా రుణాన్ని తీర్చుకునే సమయం వచ్చిందని, కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ తగాదాలు ఉంటే కేసీఆర్ బలపడతారని, అందరం ఒక్కటైతే, కేసీఆర్ పరార్ అవడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి కావచ్చు. టీఆర్ఎస్‌లో మాత్రం అయితే కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే సీఎం అవుతారు.

రసాభాసగా గ్రేటర్ కాంగ్రెస్ నాయకుల సమావేశం

Submitted by arun on Mon, 07/16/2018 - 15:32

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. సికింద్రాబాద్ ఎంపీ స్థానం విషయంలో వివాదం తలెత్తింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని అజారుద్ధీన్ ప్రకటించడంతో వివాదం తలెత్తింది. దీంతో సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్ అనుచరులు అజారుద్ధీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంత సర్ధిచెప్పినా కార్యకర్తలు వినలేదు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తాను సికింద్రాబాద్‌ వీడేది లేదంటూ అంజన్ స్పష్టం చేశారు. దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అయితే అంజన్‌ మాట్లాడుతుండగానే సీనియర్ నేత వీహెచ్ సమావేశం నుంచి వెళ్లిపోయారు.

ప్రియాంక విషయంలో పప్పులో కాలేసిన కాంగ్రెస్!

Submitted by arun on Fri, 07/13/2018 - 15:59

భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ట్యాగ్‌ చేసింది. రైతులకు భూసారంపై నివేదికలు ఇచ్చే భూసార పరీక్షా కేంద్రాలపై మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘భూసార పరీక్షా కేంద్రాలపై కూడా మోదీ అబద్ధాలు చెబుతున్నారు. యూపీఏ హయాంలో మొత్తం 1141 భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి...’’ అంటూ ప్రియాంక చతుర్వేది బదులు ప్రియాంక చోప్రా చెబుతున్నట్టుగా ట్యాగ్ చేశారు.