crackers

దీపావళి రెండు గంటలే

Submitted by arun on Tue, 10/23/2018 - 14:08

బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పటాసుల అమ్మకాలపై నిషేధం విధించలేమని, అయితే విక్రయాలపై కొన్ని షరతులు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఇక దీపావళి పండగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా బాణసంచా విక్రయాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది.

బాణసంచా అమ్మకాలపై సుప్రీం కీలక తీర్పు

Submitted by arun on Tue, 10/23/2018 - 11:35

బాణసంచా అమ్మకాలు, తయారిపై దేశ అత్యున్నత న్యాయస్ధానం కీలక తీర్పునిచ్చింది. బాణసంచాను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను తిరస్కరించిన న్యాయస్ధానం ఇది వరకే ఉన్న పలు నిబంధనలను గుర్తు చేసింది.  లైసెన్స్ ఉన్నవారు మాత్రమే విక్రయాలు జరపాలన్న కోర్టు తగిన భద్రత లేకుండా విక్రయాలు జరపరాదంటూ ఆదేశించింది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో అమ్మకానికి అనుమతి నిరాకరించింది. బాణసంచాను రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్యే కాల్చాలంటూ సూచించింది. 
 

సోనియా గాంధీ స్పీచ్‌కు పలుమార్లు అంతరాయం

Submitted by arun on Sat, 12/16/2017 - 13:41

రాహుల్ గాంధీ పట్టాభిషేకం సభలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రసంగానికి టపాసుల మోత పలుమార్లు అంతరాయం కలిగించింది. టపాసుల శబ్దానికి ఆమె మూడుసార్లు ప్రసంగం నిలిపివేశారు. సేవాదళ్ కార్యకర్తలు టపాసులు కాల్చడం నిలిపివేయాలని కాంగ్రెస్ నేత విజ్ఞప్తి చేశారు. అయినా టపాసుల మోత కొనసాగింది. కాసేపు ప్రసంగించి సోనియా గాంధీ మళ్లీ నిలిచిపోయారు. స్పీచ్ కొనసాగించామని ఓ కాంగ్రెస్ నేతతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీని కోరారు. టపాసుల శబ్దం మధ్యే సోనియా గాంధీ ప్రసంగం కొనసాగించారు. కాసేపటి తర్వాత టపాసుల మోత నిలిచిపోయింది.