chandrababu

పక్కపక్కనే నిల్చున్నా పలకరించుకోని చంద్రబాబు, పవన్!

Submitted by arun on Fri, 06/22/2018 - 12:51

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ‌్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురెదురు పడ్డారు. అయినా ఒకరిని ఒకరు కనీసం మాట వరసకు కూడా పలకరించుకోలేదు.  ఇద్దరు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటూనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో వేర్వేరుగా వెళ్లిన ఇద్దరు నేతలు .. వేర్వేరుగానే స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం ఇరువురు నేతలు ఒకేసారి బయటకు వచ్చినా ఒకరి వైపు మరోకరు కనీసం చూసుకోలేదు. బాబు స్ధానికులతో మాట్లాడుతుండగానే పవన్ అక్కడి నుంచే వేగంగా బయటకు వెళ్లిపోయారు. బయట పలువురు టీడీపీ నేతలున్నా ఆయన జనసేన కార్యకర్తలతో పాటు వెళ్లిపోయారు.

వైసీపీ అధికారంలోకి వస్తుంది : ఉండవల్లి

Submitted by arun on Mon, 06/18/2018 - 16:06

ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే...ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌‌ సభలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారని...జగన్‌ బస్సు పెడితే జనం ఎక్కరన్న ఆయన...చంద్రబాబు సభలకు మాత్రం డబ్బు ఇస్తే జనం వస్తారని చెప్పారు. చంద్రబాబును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్న ఉండవల్లి....ఎన్నికలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అని అన్నారు.

భారీ వ్యూహంతో ఢిల్లీకి చంద్రబాబు

Submitted by arun on Sat, 06/16/2018 - 17:19

నీతి ఆయోగ్ 4వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రేపు  న్యూ ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు పాల్గోనున్నారు. ఈ సమావేశంలో న్యూ ఇండియా 2022 డెవలప్‌మెంట్ ఎజెండాకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

మోడీ సర్కారుపై మరోసారి చంద్రబాబు ఫైర్

Submitted by arun on Fri, 06/15/2018 - 17:58

మోడీ సర్కారుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కార్యాలయాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న సీఎం కేజ్రీవాల్‌‌కు మద్దతు తెలిపిన చంద్రబాబు..కేంద్రంలోని అధికార పార్టీ కొత్త సంస్కృతికి తెరలేపిందంటూ ట్వీట్ చేశారు. గవర్నర్లను స్వప్రయోజనాలకు ఉపయోగించుకొవడం రాజ్యాంగ విరుద్ధంమని వ్యాఖ్యానించారు.

పోసానిని హైదరాబాద్‌లో తిరుగనివ్వం... టీడీపీ అల్టిమేటం

Submitted by arun on Mon, 06/11/2018 - 17:56

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని ఎంఎన్‌ శ్రీనివాస్‌ చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు హుటాహుటిన వచ్చారు.

చంద్రబాబును ఓడించడం ఈజీ కాదు : బీజేపీ

Submitted by arun on Sat, 06/09/2018 - 14:49

‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తన అస్తిత్వానికే ముప్పువుంటుందని, అందుకే తనదైన శైలిలో రాజకీయ క్రీడను చంద్రబాబు మొదలుపెట్టారని అన్నారు. ఎన్నికలను ఆరునెలల ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వస్తుందని తాము అనుకున్నామని, కానీ, తమ అంచనాలకు భిన్నంగా ఏడాదికి ముందే చంద్రబాబు బయటకువచ్చారని తెలిపారు.

ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలి?: చంద్రబాబు

Submitted by arun on Sat, 06/02/2018 - 10:32

విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. 2014 బాధా సంవత్సరమని, జూన్ 2 చీకటిరోజని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో తొలి ఏడాది రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారనిప్రశ్నించారు. కాంగ్రెస్‌ మోసం చేస్తే.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మౌనం వెనక అర్థమేంటి బాబూ?

Submitted by hmtvdt on Sun, 04/29/2018 - 23:35

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీని, సీఎం బాబును, మంత్రి లోకేష్ ను ఓ రేంజ్ లో ఆరోపణలతో ఆడుకుంటున్నారు. కానీ.. అంతకు తగిన విధంగా.. చంద్రబాబు నుంచి లోకేష్ నుంచి ఆఖరికిట టీడీపీ నేతల నుంచి కూడా ప్రతిస్పందన రావడం లేదు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ప్రత్యక్షంగా ఓ సారి.. పరోక్షంగా మరోసారి కామెంట్లు చేస్తున్న పవన్ విషయంలో.. ఇంకా మౌనవ్రతాన్నే కొనసాగిస్తున్నారు..