chandrababu

టీడీపీలో పొత్తుల కలకలం...అయ్యన్న, కేఈపై చంద్రబాబు ఆగ్రహం

Submitted by arun on Sat, 08/25/2018 - 07:46

తెలుగుదేశం పార్టీలో పొత్తుల తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. మంత్రులు కేఈ, అయ్యన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిట్‌ బ్యూరోలో చర్చించకుండా పొత్తులపై ఎలా మాట్లాడతారంటూ సీరియస్‌ అయ్యారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సీనియర్‌ మంత్రులు స్పందించడం తగదన్న చంద్రబాబు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. 

పవన్ ఎక్కడ?

Submitted by arun on Sat, 07/21/2018 - 11:07

బీజేపీ వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దెబ్బ తీస్తోన్నవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. లోక్‌‌సభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన తీరు బాధ కలిగించిందన్న చంద్రబాబు అధికారముందన్న అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్డీఏ సర్కార్‌ చేస్తోన్న ద్రోహాన్ని మొత్తం దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

జేసీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు

Submitted by arun on Thu, 07/19/2018 - 17:17

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కీలక సమయంలో అలకబూనారు. పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలోనే పార్లమెంట్ సమావేశాలకు జేసీ రాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. సాయంత్రంలోపు జేసీ వ్యవహారశైలిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతోనే అలక బూనినట్లు తెలుస్తోంది. మరోవైపు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సీఎం చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతపురం టౌన్‌లో రోడ్ల విస్తరణ విషయంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌ చౌదరి మధ్య విభేదాలు తలెత్తాయ్.

చంద్రబాబు, జగన్‌కు పవన్ కల్యాణ్ ఓపెన్ చాలెంజ్

Submitted by arun on Sat, 07/07/2018 - 08:06

సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్‌కు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓపెన్ చాలెంజ్ విసిరారు. విశాఖ రైల్వే జోన్ కోసం.. ముగ్గురం కలిసి రైల్ రోకో చేద్దాం.. అప్పుడెందుకు రైల్వే జోన్ రాదో చూద్దామన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై తనకు చిత్తశుద్ధి ఉందని.. తెలుగుదేశం నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. రాజీనామాలు చేసి ముందుకు రావాలన్నారు పవన్. విశాఖ జిల్లా తగరపువలసలో.. టీడీపీ, బీజేపీపై పవన్ విమర్శలు గుప్పించారు.
 

3లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు

Submitted by arun on Thu, 07/05/2018 - 17:11

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి మూడు లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఒకేసారి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన గృహ నిర్మాణశాఖ అంతకు రెండు రెట్లు ఎక్కువగా మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేపట్టింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద  రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి.

పక్కపక్కనే నిల్చున్నా పలకరించుకోని చంద్రబాబు, పవన్!

Submitted by arun on Fri, 06/22/2018 - 12:51

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ‌్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురెదురు పడ్డారు. అయినా ఒకరిని ఒకరు కనీసం మాట వరసకు కూడా పలకరించుకోలేదు.  ఇద్దరు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటూనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో వేర్వేరుగా వెళ్లిన ఇద్దరు నేతలు .. వేర్వేరుగానే స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం ఇరువురు నేతలు ఒకేసారి బయటకు వచ్చినా ఒకరి వైపు మరోకరు కనీసం చూసుకోలేదు. బాబు స్ధానికులతో మాట్లాడుతుండగానే పవన్ అక్కడి నుంచే వేగంగా బయటకు వెళ్లిపోయారు. బయట పలువురు టీడీపీ నేతలున్నా ఆయన జనసేన కార్యకర్తలతో పాటు వెళ్లిపోయారు.

వైసీపీ అధికారంలోకి వస్తుంది : ఉండవల్లి

Submitted by arun on Mon, 06/18/2018 - 16:06

ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే...ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌‌ సభలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారని...జగన్‌ బస్సు పెడితే జనం ఎక్కరన్న ఆయన...చంద్రబాబు సభలకు మాత్రం డబ్బు ఇస్తే జనం వస్తారని చెప్పారు. చంద్రబాబును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్న ఉండవల్లి....ఎన్నికలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అని అన్నారు.

భారీ వ్యూహంతో ఢిల్లీకి చంద్రబాబు

Submitted by arun on Sat, 06/16/2018 - 17:19

నీతి ఆయోగ్ 4వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రేపు  న్యూ ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు పాల్గోనున్నారు. ఈ సమావేశంలో న్యూ ఇండియా 2022 డెవలప్‌మెంట్ ఎజెండాకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

మోడీ సర్కారుపై మరోసారి చంద్రబాబు ఫైర్

Submitted by arun on Fri, 06/15/2018 - 17:58

మోడీ సర్కారుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కార్యాలయాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న సీఎం కేజ్రీవాల్‌‌కు మద్దతు తెలిపిన చంద్రబాబు..కేంద్రంలోని అధికార పార్టీ కొత్త సంస్కృతికి తెరలేపిందంటూ ట్వీట్ చేశారు. గవర్నర్లను స్వప్రయోజనాలకు ఉపయోగించుకొవడం రాజ్యాంగ విరుద్ధంమని వ్యాఖ్యానించారు.

పోసానిని హైదరాబాద్‌లో తిరుగనివ్వం... టీడీపీ అల్టిమేటం

Submitted by arun on Mon, 06/11/2018 - 17:56

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని ఎంఎన్‌ శ్రీనివాస్‌ చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు హుటాహుటిన వచ్చారు.