chandrababu

చంద్రబాబు, రాహుల్ భేటీతో వేడెక్కిన రాజకీయ వాతావరణం

Submitted by arun on Fri, 11/02/2018 - 11:27

దేశ చరిత్రలో ఒక సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అడుగు పడింది. గతంలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్‌, టీడీపీ చేతులు కలిపాయి. 36 ఏళ్ల సైద్ధాంతిక రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ...ఉమ్మడి ప్రత్యర్థి మోడీని ఎదుర్కొనడానికి రంగం సిద్ధం చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీలో కాంగ్రెస్‌ సారథి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యి..దేశ రాజకీయాల్లో కొత్త పునరేకీకరణకు తెరతీశారు. గతం గురించి తమకు ముఖ్యంకాదన్న రాహుల్, చంద్రబాబు...భవిష్యత్తు గురించే ఏకమైనట్లు ప్రకటించారు. అలాగే విపక్ష నాయకులతో చంద్రబాబు జరిపిన మంతనాల ఫలితంగా....

ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే బలిదానాలు జరిగేవా?: బాల్క సుమన్

Submitted by arun on Sat, 10/27/2018 - 13:45

కాంగ్రెస్ నాయకులు మాట్లాడే భాష, వారి వ్యవహరిస్తున్న తీరును అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. విద్యార్థుల బలిదానాలకు కేసీఆర్ కారకుడని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకోవడం వల్లే బలిదానాలు జరిగాయన్నారు. ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే ఇంతమంది బలిదానాలు జరిగేవా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. 

చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన వీహెచ్‌‌

Submitted by arun on Tue, 10/23/2018 - 17:04

ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్‌‌ సీనియర్‌ నేత వీహెచ్‌ పొగడ్తలతో ముంచెత్తారు. మహాకూటమి సీట్ల సర్దుబాటులో పంతానికి పోవద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించడం హర్షణీయని అన్నారు. టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా మహాకూటమిలో అందర్నీ కలుపుకుపోతామని వీహెచ్‌ తెలిపారు. కేసీఆర్‌ ఎంతతిట్టినా బాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని వీహెచ్ అన్నారు. బీసీలకు సీట్ల కోటాయింపుపై ఢిల్లీలో చర్చలకు తనను పిలవలేదని, రాష్ట్రంలో తనకంటే పెద్ద బీసీ నాయకుడు ఎవరున్నారని ప్రశ్నించారు. బీసీ సాధికారత కమిటీ ఏర్పాటు చేసి తప్పు చేశారన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని వీహెచ్‌ స్పష్టం చేశారు.
 

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ

Submitted by arun on Sat, 10/13/2018 - 13:05

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో టిట్లీ తుఫానుతో నెలకొన్న నష్టంపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్‌తో తీవ్ర నష్టం జరిగిందని, రెండు జిల్లాల్లో 2 వేల 800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణమే 12వందల కోట్లు ఇవ్వాలని లేఖలో సీఎం కోరారు. టిట్లీ తుఫాన్‌ ఉధృతికి ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయని, హార్టీకల్చర్‌కు వెయ్యి కోట్ల నష్టం చేకూరిందని, అలాగే ఇతర పంటలు 8వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

మోడీకి చంద్రబాబు వార్నింగ్‌

Submitted by santosh on Wed, 10/10/2018 - 17:26

అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అనంతపురం జిల్లాలో నిర్వహించిన సభలో  మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో రెండు మూడు పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడమే అలవాటుగా మారిందన్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు మోడీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు.  తాము బీజేపీతో విభేదించక ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని టీఆర్‌ఎస్ నేతలు కూడా డిమాండ్‌ చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

అడుక్కుంటే నేనే నాలుగు సీట్లు ఇస్తాను : కేసీఆర్

Submitted by arun on Wed, 10/03/2018 - 18:06

నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేశారు. సిగ్గులేకుండా తెలంగాణను నాశనం చేసినవారితోనే కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రవాళ్లకు అధికారం అప్పగిస్తారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడికి పదును పెట్టి ఎన్నికల ప్రచారంలో హీట్ రాజేశారు. తెలంగాణను నాశనం చేసినవాళ్లతో పొత్తు పెట్టుకోవడం కన్నా తనను అడిగితే, నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు నమ్మోద్దన్నారు కేసీఆర్.

బాబ్లీ వివాదంలో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Fri, 09/21/2018 - 13:14

బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. బాబ్లీ కేసులో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ధర్మాబాద్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. వచ్చే నెల 15న చంద్రబాబుతో సహా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు అందుకున్న వారంతా హాజరు కావాల్సిందేనని  ధర్మాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. చంద్రబాబు తరుఫు లాయర్లు కొంత సమయం కోరగా ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమన్న జడ్జి తదుపరి విచారణ అక్టోబర్‌ 15కు వాయిదా వేశారు.

చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి

Submitted by arun on Sat, 09/15/2018 - 16:05

తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి కానీ దొంగలా రావొద్దని టీఆర్‌ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలేనని...బాబు కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా రెడీగా ఉందన్నారు. చంద్రబాబు తెలివైన దొంగ అని  తెలంగాణను పాడు చేయడానికి బాబు టీడీపీ ఆఫీసులో డెన్‌ను ఏర్పాటు చేశాడని విమర్శించారు. అవినీతితో అడ్డదిడ్డంగా సంపాదించిన ధనంతో తెలంగాణను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడు. టీడీపీ కుట్రలను ఎలా విచ్ఛిన్నం చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలుసన్నారు.