Top Stories

హస్తినకు చేరిన టీ.కాంగ్రెస్ పంచాయతీ...ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఫిర్యాదు చేయనున్న సీనియర్ల

Submitted by arun on Wed, 06/20/2018 - 07:58

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ హస్తినకు చేరింది. గతకొంత కాలంగా పీసీసీ చీఫ్ వర్సెస్.. ఉత్తమ్‌ వ్యతిరేక వర్గం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు పార్టీలో వర్గపోరు తీవ్రం కావడంతో పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉత్తమ్ వ్యతిరేక వర్గం నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఆ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. 

సొంత ఒరవడితో మిమిక్రీ రంగంలో ప్రత్యేక గుర్తింపు

Submitted by arun on Tue, 06/19/2018 - 13:56

నేరెళ్ల వేణుమాధవ్‌ 1932 డిసెంబర్ 28న వరంగల్‌ జిల్లాలో జన్మించారు.  సెలబ్రెటీలు, ప్రముఖుల వాయిస్‌లను ఇమిటేట్‌ చేయడంలో నేరెళ్ల దిట్ట. వేణుమాధవ్‌కు ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మిమిక్రీ కళాకారులు పిలుచుకుంటారు. 1947లో 16 ఏళ్ల వయసులో కెరీర్‌ను ప్రారంభించారు నేరెళ్ల వేణు మాధవ్‌. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, తమిళలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చి నేరెళ్ల రికార్డు సృష్టించారు. పొట్టి శ్రీరాములు యూనివర్శిటీలో మిమిక్రీ కోర్సు చేశారు. మిమిక్రీ కోర్సులో డిప్లొమా చేసిన తొలి వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్‌.

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

Submitted by arun on Tue, 06/19/2018 - 12:31

ప్రపంచ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గతకొద్ది కాలంగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన  వరంగల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్‌ 28న వరంగల్‌ జిల్లా  మట్టెవాడలో  జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ రంగంలో తన సొంత ఒరవడితో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం  వేణుమాధవ్‌ పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.  పద్మశ్రీ పురస్కారం అందుకున్న నేరెళ్ల  మూడు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్‌ పొందారు. 

విషాదంగా ముగిసిన పసికందు ‘కుమారస్వామి’ కథ

Submitted by arun on Tue, 06/19/2018 - 11:31

కర్ణాటకలో పసికందు చిన్నారి కుమారస్వామి కథ విషాదంగా ముగిసింది. బ్లడ్‌, బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ సోకి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే చనిపోయిన 11 రోజుల తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని తెలియచేసింది. దీంతో పోలీసు సిబ్బంది, స్థానికుల్లో విషాదం నెలకొంది.

గౌరీ లంకేశ్ ఓ కుక్క.. ఆమె మరణంపై మోదీ సమాధానం చెప్పాలా..?

Submitted by arun on Mon, 06/18/2018 - 13:00

కర్ణాటకలో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంకేశ్ హత్య కేసులో ప్రధాని మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన ఆయన.. ‘‘కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి మోదీ ఎందుకు స్పందించాలి?’’ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు.

తొమ్మిదేళ్ల బాలిక అపూర్వ సాహసం...బావిలో పడిన సోదరిని కాపాడిన బాలిక

Submitted by arun on Mon, 06/18/2018 - 11:38

ఎవరైనా బావిలో పడితే కాపాడండి .. కాపాడండి అని అరవడం కామన్‌గా మనం చూస్తుంటాం. కాని ఆ తొమ్మిదేళ్ల బాలిక తన సోదరిని కాపాడుకునేందుకు ఎవరి కోసం చూడలేదు.  వయస్సులో చిన్నదైన  ... సమయానికి స్పందించింది. క్లిష్ట సమయంలో బుద్ధిబలంతో పాటు భుజబలం ఉపయోగించి  సోదరిని రక్షించుకుంది. బావిలో పడిన  సోదరిని కాపాడుకునేందుకు  అపూర్వ సాహసం చేసింది.  

నిర్మల్‌ జిల్లాలో దారుణం..పదేళ్ల బాలిక కిడ్నాప్‌, హత్యాచారం

Submitted by arun on Mon, 06/18/2018 - 10:49

పదేళ్ల చిన్నారి అత్యాచారం, హ‌త్యపై ఊరు ఊరంతా ఒక్కటైంది.. జరిగిన దారుణాన్ని సహించలేక.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నిందితుడిని నడిరోడ్డుపై చంపేయ్యాల్సిందే అంటూ.. నినదించింది. మరోసారి మరొకరు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుండా బుద్దిచెప్పాల్సిందే అంటూ.. నిరసన చేపట్టింది. నిర్మల్ జిల్లా సోన్‌ మండలం కూచనపల్లి గ్రామం.. ఆందోళనలతో అట్టుడుకింది. 

భారీ వ్యూహంతో ఢిల్లీకి చంద్రబాబు

Submitted by arun on Sat, 06/16/2018 - 17:19

నీతి ఆయోగ్ 4వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రేపు  న్యూ ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు పాల్గోనున్నారు. ఈ సమావేశంలో న్యూ ఇండియా 2022 డెవలప్‌మెంట్ ఎజెండాకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఉత్తమ్ హస్తిన టూర్ పై ఉత్కంఠ

Submitted by arun on Sat, 06/16/2018 - 15:14

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి....కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అర గంటకు పైగా తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, కమిటీల కూర్పుపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌‌తో ఉత్తమ్ భేటీ కానున్నారు. తెలంగాణకు ముగ్గురు ఇంచార్జ్‌ సెక్రటరీలు, మరో ఇంచార్జ్‌ జాయింట్ సెక్రటరీ నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించేందుకు ఉత్తమ్‌ చర్చలు జరుపుతున్నారు. 

ఆఫీసుకు గుర్రంపై వెళ్లిన ఉద్యోగి

Submitted by arun on Sat, 06/16/2018 - 12:27

చేసినన్ని రోజులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. చివరికి మానేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. ఉద్యోగం చేసినన్ని రోజులు.. గంటలకు గంటలు ట్రాఫిక్‌లో వెయిట్ చేసి.. చేసి.. ఆఫీస్‌కు వెళ్లేవాడు. చివరికి.. చిర్రెత్తుకొచ్చింది అతనికి. ఫైనల్‌గా ఉద్యోగం మానేయాలని డిసైడ్ అయ్యాడు. ఆఖరి రోజు మాత్రం.. ఆఫీస్‌కు గుర్రంపై వెళ్లి.. అందరూ అవాక్కయ్యేలా తన నిరసన తెలియజేశాడు. చూశారుగా.. ఇన్‌షర్ట్ చేసుకొని.. టై కట్టుకొని.. చక్కగా బ్యాగ్ తగిలించుకొని.. ఎంచక్కా గుర్రంపై ఆఫీసుకొచ్చేశాడు ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రోజూ ట్రాఫిక్‌లో గంటలకు గంటలు వెయిట్ చేసి.. చేసి.. చిర్రెత్తుకొచ్చింది.