jagan

జగన్ పై అన్ని పిటిషన్లను విచారించిన హైకోర్టు...

Submitted by arun on Thu, 11/08/2018 - 16:06

జగన్‌పై దాడి కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు విచారించింది. సిట్‌ దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, మరింత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారంలోపు సిట్ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరుపు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నాయి. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.  

వైసీపీ అధినేత దగ్గర సిట్‌‌కు చుక్కెదురు

Submitted by arun on Sat, 10/27/2018 - 10:16

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జగన్‌పై దాడి కేసు మరో మలుపు తిరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి వైసీపీ అధినేత నిరాకరించడంతో తదుపరి ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అసలు జగన్ వాంగ్మూలం ఇవ్వడం తప్పని సరా..జగన్ విషయంలో సిట్ అధికారులు తర్వాత ఏం చేయబోతున్నారనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఏది రియల్ ఫ్లెక్సీ.. ఏది మార్ఫింగ్... ?

Submitted by arun on Fri, 10/26/2018 - 10:46

సానుభూతి రావాలని చేశాడా... ఉసురు తీయాలని ప్రయత్నించాడా.. జగన్ అభిమానా..? టీడీపీ అనుచరుడా..? ఏది రియల్ ఫ్లెక్సీ.. ఏది మార్ఫింగ్... ? ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు.. ? 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. టీడీపీ మంత్రులు, నేతలు అతను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని అంటుండగా.. వైసీపీ నేతలు మాత్రం అభిమాని అయితే అభిమాన నేతపై దాడి ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో ఇరుపార్టీల నేతలో ఉన్న కొన్ని శ్రీనివాస్ ఫొటోలు వైరల్ అయ్యాయి.

జగన్‌పై దాడి కేసు దర్యాప్తు వేగవంతం...నిందితుడు శ్రీనివాసరావు దగ్గర 11 పేజీల లేఖ స్వాధీనం

Submitted by arun on Fri, 10/26/2018 - 10:15

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు దర్యాప్తు  వేగంగా సాగుతోంది. ఈ కేసు దర్యాప్తుకోసం సిట్ ఏర్పాటు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 11 పేజీల లేఖ స్వాధీనం చేసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవాళ హైదరాబాద్ వస్తోంది. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై క్లారిటీ ఇచ్చిన జగన్

Submitted by arun on Mon, 10/22/2018 - 16:03

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. రాధాని విజయవాడ తూర్పుకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బాలశౌరిని బరిలోకి దింపుతున్నట్టు జగన్ తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటుస్థాయి నేతల సమావేశంలో జగన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. 
 

వైసీపీలో అనూహ్యంగా ఏంటీ ఎదురుగాలి!!

Submitted by santosh on Sat, 10/06/2018 - 16:56

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో నేతల అసంతృప్తి, కార్యకర్తల ఆందోళనలు దద్దలిల్లుతున్నాయి. వరుసగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు నేతలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు సమన్వయకర్తలు ఉండటంతో ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని నియోజకవర్గం ఇన్‌చార్జిలు హడలిపోతున్నారు. 

Tags

ఎంపీ అభ్యర్ధుల కోసం వైసీపీ అన్వేషణ...ఇప్పటికే 7 చోట్ల అభ్యర్ధులు దాదాపు ఖరారు

Submitted by arun on Fri, 10/05/2018 - 11:01

వచ్చే ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పటికే అభ్యర్ధుల వేట మొదలుపెట్టిన జగన్మోహన్‌రెడ్డి ఈసారి ఎక్కువగా కొత్తవారిని రంగంలోకి దించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమరావతికి మకాం మార్చనున్న జగన్ ...డిసెంబర్‌లో కొత్తింట్లోకి...

Submitted by arun on Fri, 09/28/2018 - 10:17

అధికార పార్టీ నుంచి, మీడియా నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత నిర్ణయించుకున్నారు.  ప్రస్థుతం హైదరాబాద్ లో ఉన్న పార్టీ కేంద్ర‌ కార్యాలయాన్ని అమ‌రావ‌తికి త‌ర‌లించాలని పార్టీ సీనియర్ నేతలకు ఆదేశించారు. పాదయాత్ర పూర్తయ్యే నాటికి కార్యాలయ శాశ్వత నిర్మాణాలు పూర్తిచేయాలని జగన్ ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. 

భారతిపై సీబీఐ కేసు పెట్టాలి

Submitted by arun on Sat, 08/11/2018 - 10:07

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఇప్పటికైనా మేల్కొని భారతిపై కేసు నమోదు చేయాలని ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులను సంపాదించడానికి జగన్ కు ఆయుధంగా బ్రదర్ అనిల్ ఉపయోగపడ్డారని వర్ల గుర్తు చేశారు. భారతిపై ఈడీ కాకుండా సీబీఐ కూడా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. జగన్ 84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారంటే ఏ మేర సంపాదించారో జనం అర్థం చేసుకుంటారన్నారు. వివిధ కేసుల్లో భారతి పాత్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కన్పించినప్పుడు సీబీఐకి ఎందుకు కన్పించడం లేదని వర్ల ప్రశ్నించారు.

పవన్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజెల్ ఆగ్రహం!

Submitted by arun on Fri, 07/27/2018 - 10:36

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో దాదాపు ఏడాదిన్నర క్రితం ఓ ఆడియో సీడీ ఆవిష్కరణ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజల్ మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని చాలా ఘోరమైన పాపమని, ఇదే పనిని మీ అక్క లేదా చెల్లెలు ఇమేజ్ పెట్టి, ఇలాంటి ప్రచారమే చేస్తే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవాలని మండిపడింది. ఓ అమాయకురాలైన అమ్మాయిపై, మరొకరి కూతురిపై, ఇంకొకరి సోదరిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి మనస్తాపానికి గురిచేయడం సరైనదేనా?