tdp

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయ్ : బీజేపీ

Submitted by arun on Tue, 07/24/2018 - 17:18

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ ప్రజలను రాజకీయ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో ఏపీకి న్యాయం జరగలేదని బీజేపీతోనే ఏపీ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రధాని ఇచ్చిన చాలా హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న జీవీఎల్‌ ఏపీపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారన్న ఆయన చేతనైనంత సాయం కేంద్రం చేస్తోందన్నారు. 
 

సీఎంతో మాట్లాడా.. అంతా సమసిపోయింది: జేసీ

Submitted by arun on Mon, 07/23/2018 - 16:13

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి సమావేశం దాదాపు 20నిమిషాల పాటు సాగింది. సీఎంతో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అవిశ్వాసానికి గైర్హాజరు రాజీనామా వంటి ప్రకటనలపై చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. అయితే ఇలాంటి ప్రకటనలు ఇకపై చేయవద్దంటూ జేసీకి చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం.

అవిశ్వాసం తీర్మాణం పెట్టి టీడీపీ ఏం సాధించింది..?: కృష్ణంరాజు

Submitted by arun on Mon, 07/23/2018 - 15:44

అవిశ్వాసం కోసం 18 పార్టీల మద్దతు కూడగట్టాం అని చెప్పిన టీడీపీ పార్లమెంట్‌లో మాత్రం ఒక్క పార్టీతో కూడా ఏపీ సమస్యలపై మాట్లాడించలేకపోయారని కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అవిశ్వాసం వల్ల దేశంలో మోడీకి ఉన్న విశ్వాసం ఎంతో తేలిపోయిందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటిపై త్వరలోనే కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయబోతుందని తెలిపారు. మోడీపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీకి నివేదికలు పంపిస్తున్నట్లు కృష్ణంరాజు వివరించారు. 

టీడీపీపై పవన్ ట్వీట్ వార్...టీడీపీని గజని సినిమా హీరోతో పోల్చిన పవన్

Submitted by arun on Sat, 07/21/2018 - 10:52

టీడీపీ నేతలపై పవన్ ట్విట్టర్‌లో విరుచుకుపడుతున్నారు. అవిశ్వాసం చర్చ ముగిసిన తర్వాత టీడీపీపై జనసేనాని ట్వీట్ వార్ ప్రారంభించారు. టీడీపీని గజని సినిమా హీరోతో పోల్చిన పవన్ టీడీపీ నేతలకు మతిమరుపు జబ్బు సోకినట్లుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంలో టీడీపీ గజనిలా ప్రవర్తిస్తోందన్నారు. మొన్నటి వరకు ప్యాకేజీ అన్న టీడీపీ నేతలు ఇప్పడు హోదా అంటున్నారనీ మళ్ళీ మాట మార్చరనే గ్యారెంటీ ఉందా అని పవన్ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు ఏపీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి పవన్ ట్వాట్టర్‌లో కామెంట్ చేశారు.

తొలి టర్మ్ లోనే ఎంపీగా జయదేవ్ కు అరుదైన అవకాశం

Submitted by arun on Fri, 07/20/2018 - 17:23

అశాస్త్రీయ, అప్రజాస్వామిక విభజనతో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరపున జయదేవ్ చర్చను ప్రారంభించారు. రెండు జాతీయపార్టీలు కలసి ఏపీని నిలువునా ముంచాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఆడిన మాట తప్పారంటూ దుయ్యబట్టారు.

బెజవాడలో ఫ్లెక్సీల కలకలం

Submitted by arun on Fri, 07/20/2018 - 11:47

విజయవాడలో ప్రధాని మోడీ ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంజ్ సర్కిల్, పాత బస్టాండ్, సచివాలయం సమీపంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనను మోడీ మరిపిస్తున్నారన్న అక్షరాలు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం పై ప్రసంగించేందుకు టీడీపీకి కేవలం 13 నిముషాలు కేటాయినచ్చడం పై నిరసన వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్‌కు పట్టిన గతే రేపు బీజేపీకి పడుతుందంటూ హోర్డింగ్స్లపై  రాయించారు.

అవిశ్వాసం ఓటింగ్ తర్వాత జేసీ...టీడీపీకే గుడ్‌ బై చెబుతారా..?

Submitted by arun on Fri, 07/20/2018 - 11:08

అవిశ్వాసంపై ఓటింగ్‌కు దూరంగా ఉంటానని కలకలం రేపి జేసీ దివాకర్ రెడ్డి ఎట్టకేలకు అలక వీడారు. చంద్రబాబు ఫోన్ చేసిన తర్వాత మెత్తబడిన జేసీ నేడు లోక్‌సభకు హాజరౌతానని ప్రకటించారు. అనంతపురం గ్రూపు రాజకీయాల వల్లే జేసీ టీడీపీ హైకమాండ్‌కు ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అవి‌‌శ్వాసం ఓటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూడండంటూ జేసీ సస్పెన్స్ మిగిల్చారు.

కాక రేపుతున్న అవిశ్వాస తీర్మానం

Submitted by arun on Fri, 07/20/2018 - 11:00

ఇప్పుడు దేశం మొత్తం చూపు అవిశ్వాసంపైనే. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు చర్చకు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే యత్నాల్లో తలమునకలైన టీడీపీ చర్చ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

టీడీపీ అవిశ్వాసంపై ప్రధాని మోదీ ట్వీట్!

Submitted by arun on Fri, 07/20/2018 - 10:40

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చాలా ముఖ్యమైన రోజు అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. లోక్‌సభలో ఈరోజు నిర్మాణాత్మకమైన, అంతరాయం లేని చర్చ జరగాలని ఆంకాక్షిస్తున్నానన్నారు.  యావత్‌ భారతదేశం‌ మనల్ని చాలా నిశితంగా చూస్తోందని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కేశినేనికి షాక్.. గల్లాకు చాన్స్..!

Submitted by arun on Thu, 07/19/2018 - 16:37

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ ఎంపీలు పట్టుబట్టడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం నాడు ఓకే చెప్పారు. దీంతో మద్దతు కోసం అటు ఎన్డీఏ.. ఇటు టీడీపీ.. పార్టీల అధినేతలు, ఎంపీలను ఒప్పించి మద్దతు కూడగట్టు పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు పార్లమెంట్‌లో ఎవరితో మాట్లాడించాలి..? ఎవరైతే అందుకు సూటబుల్? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ఓ ప్రణాళికను తయారు చేశారు. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చను ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభించనున్నారు. బుధవారం నాడు ఎంపీ కేశినేని నాని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.