tdp

వేడెక్కిన హస్తిన రాజకీయం...జాతీయ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం

Submitted by arun on Thu, 11/01/2018 - 10:15

జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ హస్తిన వేదికగా కీలక పరిణామాలకు తెరలేవబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈ మధ్యాహ్నం సమావేశమవుతారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించిన చంద్రబాబు పలువురు విపక్ష నేతలతో కూడా మంతనాలు సాగిస్తారు.

ప్రధాని పదవికి చంద్రబాబు పోటీ అవుతాడని మోడీ భయపడుతున్నాడు

Submitted by arun on Wed, 10/31/2018 - 12:47

ప్రధాని పదవికి చంద్రబాబు పోటీ అవుతాడని మోడీ భయపడుతున్నారన్నారు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ. దేశంలోని మెజారిటీ స్థానిక పార్టీల అధినేతలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని 2019 ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడం ఖాయమన్నారు. బిజెపితో కుమ్మక్కైన జగన్, పవన్ లకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని కొనకళ్ల దర్శించుకుని మొక్కులు చెల్లించారు. 

‘జగన్నాటకం విఫలం’

Submitted by arun on Sat, 10/27/2018 - 11:33

వై.ఎస్. జగన్ పై టీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ హత్యాయత్నం నాటకం చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. కత్తి దాడి ద్వారా సానుభూతి పొందాలనుకుంటున్నారని చెప్పారు. కోడి కత్తి ద్వారా ఆదరణ పొందాలనుకున్నజగన్ నాటకం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హత్యా రాజకీయాలు సృష్టించి  పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జగన్ పై జరిగిన దాడి కేవలం ప్రజల్లో సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
 

టీడీపీ వ్యూహం.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?

Submitted by arun on Mon, 10/22/2018 - 15:04

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జోరు పెంచింది. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణ నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేసినట్లు సమాచారం. కూకట్‌పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు.

టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్దాం ..

Submitted by arun on Mon, 10/22/2018 - 14:08

మహాకూటమి పొత్తులుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల కోసం టీజేఎస్‌, సీపీఐ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తును జాతీయ దృష్టితో చూడాలంటూ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ తక్కువ సీట్లు ఆఫర్ చేసిన భవిష్యత్ అవసరాలు, కేసీఆర్‌ను ఎదుర్కొనే వ్యూహంతో ముందుకు వెళదామంటూ చెప్పారు. టీఆర్ఎస్ పరాజయమే లక్ష్యంగా కేడర్ పని చేయాలని బలం, విజయావకాశాలు ఉన్న చోటే పోటీ చేద్దామంటూ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

పవన్‌ వైపు పలువురు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ నేతల చూపు...అధికార టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు...

Submitted by arun on Tue, 10/16/2018 - 10:03

ప్రజా పోరాట యాత్రతో జోరు పెంచిన జనసేనాని పవన్ కల్యాణ్‌ మరోపక్క పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు‌. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేనను బలమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం క్లీన్ ఇమేజ్‌ ఉన్న సీనియర్లను పార్టీలోకి తీసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కీలక నేతల వలసలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన పవన్‌ త్వరలోనే మరికొందర్ని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మేం కరుడుగట్టిన టీడీపీ వాదులం.. మేం మీకు లొంగం

Submitted by arun on Fri, 10/12/2018 - 11:48

కక్ష సాధింపులో భాగంగానే తనపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రమేష్‌. ఐటీ దాడుల వెనక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నారు. అన్ని చట్టపరిధిలోనే ఉన్నాయి.. తాము చట్టానికి వ్యతిరేకంగా పోలేదని సీఎం రమేష్‌ తెలిపారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతుంటే.. తనపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రమేష్. తాము కరుడుగట్టిన టీడీపీ వాదులమని.. తమను ఎవరు లొంగదీసుకోలేరని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం రమేష్ తెలిపారు. 

అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

Submitted by arun on Thu, 10/11/2018 - 17:05

అనంతపురం జిల్లా టీడీపీలో నేతలు విబేధాలు తీవ్రమయ్యాయి. రాయదుర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించిన మరుసటి రోజే నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. మంత్రి కాల్వ శ్రీనివాసులు తీరుపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డరు. రాయదుర్గం టీడీపీ కంచుకోటని, మంత్రి వైఖరి వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నా తనను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మంత్రి కాల్వ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. పార్టీలో నుంచి తప్పించాలని చూస్తున్నారని, అది నీ వల్ల కాదని  దీపక్‌రెడ్డి మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 
 

కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు..

Submitted by arun on Thu, 10/11/2018 - 15:49

కాంగ్రెస్‌ పార్టీకి క్యాడర్‌ లేదని, టీటీడీపీకి లీడర్‌ లేరని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ నేత కేటీఆర్‌. సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. కరువు కోరల్లో ఉన్న సిరిసిల్లను మూడేళ్లలో అభివృద్ధిలోకి తెచ్చామని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సిరిసిల్లను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లేనని కేటీఆర్‌ చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటయ్యాయని, కేసీఆర్‌‌ను గద్దె దించడమే లక్ష్యమంటున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కేటీఆర్ అన్నారు. 

పొత్తు పొత్తుకో లెక్క... పక్కాగా నడుస్తుందా మరి!!

Submitted by santosh on Wed, 10/03/2018 - 15:55

ఒకప్పుడు కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. మొన్నటి వరకు ప్రధాన రాజకీయ పక్షంగా ఉంది. ఇప్పుడు కూడా లీడర్లు పోయినా క్యాడరుందన్న దీమాతో ఎదురీదుతోంది. కానీ నేటి తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా రంగంలోకి దిగితే, తన ఉనికికే ప్రమాదమని జంకుతోంది. అందుకే పొత్తు కోసం సిద్దాంతాలను సైతం పక్కనపెట్టి, జీవన్మరణంగా పోరాడుతోంది. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. జన సమితి, సీపీఐలు... కాంగ్రెస్‌ పార్టీ... వైఖరితో విసుగెత్తిపోతున్నాయి. టీడీపీ మాత్రం ఏదిఏమైనా కాంగ్రెస్‌తోనే జట్టుకట్టాలని నిర్ణయించింది. ఒంటరి పోరుతో తన ఉనికికే ప్రమాదమని భావిస్తున్న తెలుగుదేశం.....