trs action plan

మ‌రోసారి మొద‌ల‌యిన గులాబీ ఆకర్ష్ ...సినిమా చూడ‌బోతున్నారంటూ...

Submitted by arun on Sun, 11/04/2018 - 10:09

మ‌హాకూట‌మి సీట్ల ప్ర‌క‌ట‌న త‌ర్వాత టిఆర్ఎస్ యాక్ష‌న్ ప్లాన్ ఎలా ఉండ‌బోతోంది ? కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్న టిఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఏం ఆలోచ‌న చేస్తున్నారు ? ఇప్ప‌ట‌కే అటు కాంగ్రెస్ ఇటు టిడిపి నేత‌ల‌ను కారెక్కించుకున్న గులాబీ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను స్పీడ‌ప్ చేస్తుందా ? ఇటీవల ఎంపీ క‌విత‌, మంత్రి హ‌రీష్ రావు మ‌హాకూట‌మి సీట్ల సర్దుబాటు త‌ర్వాత సినిమా చూడ‌బోతున్నార‌ని ప‌దే ప‌దే చేస్తున్న వ్యాఖ్య‌ల వెనుక ఆంత‌ర్యం ఏంటి ?  

గులాబీతో వియ్యమా.. కయ్యమా? కనిపించని కమలం కథ!!

Submitted by santosh on Mon, 09/17/2018 - 12:23

గులాబీ-కమలం ఒకటేనన్నారు. కారెక్కకపోయినా, కారుకు ముందస్తు ఇంధనం పోస్తున్నది, కాషాయదళమేనన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌ అప్రకటిత స్నేహతులని కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు చేశాయి. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన, ీబీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఈ ఆరోపణలన్నింటికీ ఆన్సర్ ఇచ్చేశారు. గులాబీతో వియ్యం కాదు, కయ్యమేనని ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ సర్కారుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టి, స్నేహం లేదు సమరమేనని యుద్ధభేరి మోగించారు. అమిత్‌ షా టూర్‌లో తేలింది ఇదేనా....కనపడని వ్యూహం ఇంకేమైనా ఉందా?