election commission of india

పెరిగిన పోలింగ్‌.. ఎవరికి కలిసొచ్చేనో..

Submitted by chandram on Sun, 12/09/2018 - 16:07

2014 ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. అయితే పోలింగ్ పర్సెంటెజ్ పెరగడం పట్ల రాజకీయ పార్టీల విశ్లేషణలు ఎలా ఉన్నఇది ఓ మంచి పరిణామం అని అంటోంది ఎన్నికల కమిషన్. తాము మున్నెళ్ళ నుంచి చేసిన కృషికి ఇది మంచి ఫలితమని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా  రికార్డుస్థాయిలో 73.20 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలోనూ పెరగడం ఇక్కడ చర్చినీయంశం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 73.20 పోలింగ్‌ శాతం నమోదవగా, వందకు పైగా నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్‌ రికార్డైంది.

రైల్వే కేసుల ఉపసంహరణపై ఈసీఐ సీరియస్

Submitted by arun on Sat, 12/01/2018 - 11:31

ఎన్నికల కోడ్ సమయంలో రైల్వే కేసుల ఉపసంహరణపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కేసుల ఉపసంహరణపై న్యాయశాఖ కార్యదర్శికి అనుమతి ఉందా అని ఈసీ ప్రశ్నించింది. దీనిపై సీఎస్ ఎస్.కె.జోషికి నోటీసులు జారీ చేసింది ఈసీ. 

ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో గుర్తు!

Submitted by arun on Sat, 11/10/2018 - 14:52

ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో గుర్తు వుంటుంది... తెరాస అనగానే..కారు గుర్తు, హస్తం అనగానే..కాంగ్రెస్.. సైకిల్ అనగానే...తెలుగు దేశం.. ఫ్యాన్ అనగానే..వైసీపీ మనకి గుర్తుకు వస్తాయి... అయితే... భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను ఎవరు కేటాయించేది మీకు తెలుసా! రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది మన ఎన్నికల సంఘం.శ్రీ.కో.

డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు

Submitted by arun on Sat, 10/06/2018 - 15:33

ఈ ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియాతో మాట్లాడారు. నాలుగు రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఓపీ రావత్.. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. డిసెంబర్  11న కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిపై కేసు నమోదు

Submitted by arun on Thu, 10/04/2018 - 17:37

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నేత ఏనుగు రవీందర్ పై 171 బి కింద అధికారులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో మహిళా సంఘాలకు ప్రలోభ పెట్టేలా మాట్లాడారని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ను ఎన్నికల సంఘానికి పంపినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్కల్ గ్రామంలో ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రలోభాలకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ప్రతిపక్షాలు ఎలక్షన్‌ కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ ఈ తతంగంపై విచారణ జరిపారు.

4 రాష్ట్రాలతోపాటే తెలంగాణ ఎన్నికలు

Submitted by arun on Sat, 09/29/2018 - 10:36

తెలంగాణలో ముందస్తుకు ముహూర్తం సిద్ధమైంది. 4 రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు నిర్వహించేందుకు ఈసీ సిద్ధం అవుతోంది. శుక్రవారం భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఉమేశ్‌ సిన్హా కమిటీ రిపోర్ట్‌ను పరిశీలించిన ఈసీ తెలంగాణకు సీఈసీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించే తేదీలను ఖరారు చేయనుంది. 

అధ్యయనం తర్వాతే అసలు కథ!! ఈసీ సీక్రెట్‌ ఇదే!

Submitted by santosh on Sat, 09/15/2018 - 11:50

ఎన్నికల సన్నద్ధతపై పూర్తి సంతృప్తి చెందాకే షెడ్యూల్ ఖరారు చేస్తామంటోంది ఎన్నికల కమిషన్. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్న తర్వాతే, తేదీలను ప్రకటిస్తామంటోంది. అలాగే, రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టో విడుదల చేసేముందు డ్రాఫ్ట్ ను, ఎన్నికల సంఘానికి ఇవ్వాలంటోంది. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామంటోంది ఈసీ. తెలంగాణలో ఎన్నిక నిర్వహణ, ఏర్పాట్లపై ఎప్పటికప్పడు సమీక్షలు చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈసారి ధన,మద్యం ప్రవాహంను అడ్డుకునేందుకు గట్టి నిఘా పెత్తామని అంటోంది.