tdp

ఇబ్రహీంపట్నం సీటుపై వీడిన ఉత్కంఠ

Submitted by arun on Mon, 11/19/2018 - 11:49

ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ టికెట్‌‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అక్కడ టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సామ రంగారెడ్డికే బీఫాం దక్కింది. సామ రంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని టీడీపీ రెండు రోజుల కిందట ప్రకటించినా ఆయనకు పార్టీ నిన్న బీఫాం ఇవ్వలేదు. ఇదే సమయంలో ఆయనను టీఆర్‌ఎస్‌ హైజాక్‌ చేసిందంటూ ఇదే సెగ్మెంట్‌ టికెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. సామను బరిలోకి దింపితే బలిపశువు అయినట్లేనని అన్నారు. 

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని

Submitted by arun on Fri, 11/16/2018 - 10:26

తెలంగాణ ఎన్నికల బరిలో నందమూరి కుటుంబం తలపడటం ఖాయమైంది. నందమూరి వారసురాలు టీడీపీ అభ్యర్థిగా భాగ్యనగరం నుంచి పోటీ చేయబోతున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ టికెట్‌ను దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి పార్టీ కేటాయించింది. అటు తెలంగాణలో పోటీ చేస్తున్న 14 స్థానాలకు గానూ ఇప్పటికి 12 సీట్లను ప్రకటించిన టీడీపీ మరో ఇద్దరి పేర్లను ప్రకటించాల్సి ఉంది.  

కాంగ్రెస్‌లో కట్టలు తెంచుకున్నఆశావహుల ఆగ్రహం...

Submitted by chandram on Fri, 11/09/2018 - 19:46

తలుపులు బద్దలవుతున్నాయి, దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి, శాపనార్థాలు  హోరెత్తుతున్నాయి. ప్రళయం తప్పదన్న హెచ్చరికలు పెళ్లుమంటున్నాయి. భూకంపం సృష్టిస్తామన్న కేకలు కెవ్వుమంటున్నాయి. అభ్యర్థులపై కేవలం టీజర్‌ రిలీజ్‌ చేసిన కొన్ని గంటల్లోనే, హస్తం పార్టీ బాక్సాఫీసు అల్లకల్లోలమవుతోంది. మహాకూటమి జాబితా విడుదలైన తర్వాత మహా ప్రళయమేనా?

కొలిక్కిరాని కూటమి లెక్కలు...

Submitted by chandram on Fri, 11/09/2018 - 19:33

రోజుల తరబడి సమీక్షలు, చర్చలు, వరుసగా సమావేశాలు, మంతనాలు అయినా మహాకూటమి లెక్కలు కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ కు తమ సీట్లపై క్లారిటీ వచ్చినా భాగస్వామ్య పార్టీలకు సీట్ల కేటాయింపుపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో ముందు తమ లెక్కతేల్చాలని తెగేసి చెబుతోంది సీపీఐ. మహాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదలకు సిద్ధమైన నేపధ్యంలో తమకు సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదని భాగస్వామ్య పక్షాలు అంటున్నాయి. ఎన్నికలు సమీపించడంతో సీట్లతో పాటు తమకు కేటాయించే స్థానాలపై కూడా క్లారిటీ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం

Submitted by arun on Thu, 11/08/2018 - 14:05

కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తులను వార్ రూం సమావేశానికి ఆహ్వానించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి, సామాజిక సమీకరణాలను వివరిస్తూ బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలో 2004 తరహా పరిస్ధితులు ఉన్నాయని  నాటి తరహాలోనే ఇప్పుడు కూడా పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నందున అంతా సహకరించాలంటూ కోరుతున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా అంతా సహకరించాలని కోరుతున్న నేతలు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే, కార్పోరేషన్ పదవులు ఇస్తామంటూ నచ్చజెబుతున్నారు.

మహాకూటమిలో పెరుగుతున్న నిరసనలు...ఉత్తమ్‌ ఇంటి ముట్టడికి...

Submitted by arun on Sun, 11/04/2018 - 12:49

మహాకూటమిలో అప్పుడే నిరసన సెగలు జోరందుకున్నాయి. పొత్తుల్లో భాగంగా.. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ను టీడీపీకి కేటాయించారనే వార్తలతో.. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ ఆధ్వర్యంలో అనుచరులు, కార్యకర్తలు.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. దీంతో ఉత్తమ్‌ ఇంటి దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు అదే శేరిలింగంపల్లిలో టీడీపీ నాయకుడు భవ్య ఆనంద ప్రసాద్‌ ప్రచారం చేస్తుండగా ఆ పార్టీకి చెందిన మువ్వ సత్యనారాయణ వర్గం అడ్డుకుంది.

మహాకూటమిలో సీట్ల పంపకాలు ఖరారు ?

Submitted by arun on Sat, 11/03/2018 - 17:00

ప్రతిపక్ష మహాకూటమికి సంబంధించి సీట్ల పంపకాల విషయంలో ఎట్టకేలకు కొలిక్కివచ్చినట్లే తెలుస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుందని తెలిసిన విషయమే అయితే కూటమిలోని పార్టీలకు సీట్ల పంపకాల వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద సమ్యసగా ఏర్పడింది. ఇదే క్రమంలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా, 95 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మిగతా 24 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించనుంది.

‘కాంగ్రెస్‌తో దోస్తీ​.. ఎన్టీఆర్‌ ఫొటో, పేరు వాడుకోవద్దు’

Submitted by arun on Sat, 11/03/2018 - 14:47

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారని కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నారని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లక్ష్మీపార్వతి  ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు దుష్టరాజకీయాలపై లక్ష్మీపార్వతి ఒక లేఖ రాసి ఎన్టీ రామారావు సమాధి వద్ద ఉంచారు.

టీడీపీ ఎఫెక్ట్‌...వరుస రాజీనామాలతో ఏపీ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ

Submitted by arun on Sat, 11/03/2018 - 14:38

టీడీపీతో దోస్తీ... ఏపీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్‌ పార్టీని దుమ్మెత్తిపోసిన తెలుగుదేశంతో చేతులు కలపడాన్ని సీనియర్‌ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఉప్పూ నిప్పులా వ్యవహరించిన పార్టీతో ఎలా జత కడతారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సోనియాగాంధీని ఇటలీ దెయ్యమని, అవినీతి అనకొండ అంటూ నోరు పారేసుకున్న చంద్రబాబుతో  రాహుల్‌ జట్టు కట్టడాన్ని ఏపీ కాంగ్రెస్‌ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు చేయి చెంతకు చేరారని, కానీ చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని సూచిస్తున్నారు.

తుది మెరుగులు దిద్దుకుంటోన్న టీటీడీపీ మేనిఫెస్టో

Submitted by arun on Fri, 11/02/2018 - 12:18

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చడంతో పాటు బెల్ట్ షాపుల రద్దు, పెన్షన్ల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, రెండు లక్షల లోపు వ్యవసాయ రుణ మాఫీ వంటి హమీలకు మేనిఫెస్టోలో చోటు కల్పించారు. ముసాయిదా మేనిఫెస్టోపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.