Vijayashanti

కీలక ప్రకటన చేసిన విజయశాంతి

Submitted by arun on Mon, 10/01/2018 - 17:41

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పష్టం చేశారు. 430 మండలాల్లో ప్రచారం చేస్తానని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పానని తెలిపారు. తనను కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటివరకు చెప్పలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటాననే భయంతోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్‌కు పార్టీలను ఒప్పించలేని కేసీఆర్.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని అనడం హ్యాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ అహంకారపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

అన్నా, చెల్లెల మధ్య యుద్ధం: విజయశాంతి

Submitted by arun on Sat, 09/29/2018 - 16:09

రానున్న యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు విజయశాంతి. ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అన్నా, చెల్లెల మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం తామంత కలిసి టీమ్ వర్క్ చేస్తున్నామన్నారు విజయశాంతి.  సీఎం కేసీఆర్‌ తనను దేవుడిచ్చిన చెల్లి అన్నారని, ఈ అన్నా, చెల్లెల మధ్య పోరాటానికి ప్రజలే తీర్పు చెబుతారన్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పజెప్పిన తమ అధినేత రాహుల్‌ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని, తన గురించి తర్వాత మాట్లాడుతానని చెప్పారు.

టీడీపీతో పొత్తుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 11:32

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వద్దే వద్దన్నారు. తొలి నుంచి టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్న ఆమె.. మరింత ఘాటుగా స్పందించారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు అవసరమా ? కాదా అన్న విషయాన్ని అధిష్టానం మరోమారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీతో పొత్తుపై తెలంగాణ ప్రజల్లో అభ్యంతరం ఉందన్నారు. ఈ నెల 15 తర్వాత నుంచి రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.