NOTA

నోటాకు ఎందుకు టాటా? అసలు ఏముంది ఆ మూవీలో!?

Submitted by arun on Thu, 10/04/2018 - 16:27

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నోటా మూవీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు మరో వైపు నోటా మూవీని అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు నోటాకు ఎందుకు నో చెబుతున్నారు ? నిజంగానే ఓ పార్టీకి అనుకూలంగానే ఈ చిత్రాన్ని నిర్మించారా ? మూవీ విడుదలయితే శాంతి భద్రతలు తలెత్తే ప్రమాదముందా ? లేక ఈ చిత్రం నిజంగానే ప్రేక్షకులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయా ? 

NOTA (None of the above లేదా....పైన పేర్కొన్నది ఏది కాదు)

Submitted by arun on Thu, 10/04/2018 - 14:05

NOTA (None of the above లేదా....పైన పేర్కొన్నది ఏది కాదు) రాజకీయ థ్రిల్లర్ సినిమా... . ఈ సినిమా తమిళం మరియు తెలుగు భాషలలోని ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తుంది.  విజయ్ దేవరకొండ మొదటి సారిగా తమిళ చిత్రములో పని చేస్తున్నాడు.. ఈ సినిమాలో  విజయ్ దేవరకొండ మరియు మెహ్రీన్ పిర్జాడలో ప్రధాన పాత్రలలో నటించారు. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ చిత్రంలో సంగీత దర్శకుడిగా సాం సి.ఎస్ .. అలాగే...  రవి కే చంద్రన్ కుమారుడు సంతానా కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 5, 2018 న విడుదల కాబోతుంది.  అమెరికాలో ప్రీమియర్లు.అక్టోబరు 4, 2018 రోజునే పడుతున్నాయట.

Tags

‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్

Submitted by arun on Tue, 10/02/2018 - 14:25

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు. నోటా సినిమాను నిలిపివేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. నోటా సినిమా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. యువతపై ప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని అన్నారు. నోటా ట్రైలర్‌ ఓటర్‌ను ప్రభావితం చేసేలా ఉందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి.  ఎన్నికల సంఘం నోటా ప్రివ్యూ చూసిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరగకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

Tags

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్‌

Submitted by arun on Wed, 09/12/2018 - 11:19

యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగానే రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. మురుగదాస్‌ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్‌ చేస్తుండటంపై ఆనంద్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.