ntr-jr-returns-aravinda-sametha-sets

‘అరవింద సమేత వీర రాఘవ’లో మెగాస్టార్..?

Submitted by nanireddy on Tue, 09/11/2018 - 18:13

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ త్రివిక్రమ్ శ్రీనివాస రావు దర్శకత్వంలో మొదటిసారి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం టాకీ పార్ట్‌ దాదాపు  కంప్లీట్‌ అయిందని సమాచారం. ప్రస్తుతం సాంగ్స్‌ షూట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అరవింద సమేతలో  అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.