kondagattu-bus-accident-updates

కొండగట్టు బస్సు ప్రమాదం.. మొదటి సస్పెన్షన్..

Submitted by nanireddy on Tue, 09/11/2018 - 17:56

జగిత్యాల జిల్లా కొండగట్టులో సామర్థ్యానికి మించి ప్రయాణికులతో  వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికంగా మహిళలు ఉండగా.. నలుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్, ఆర్టీసీ డిపో నిర్లక్ష్యం కారణంగా జరిగిందని అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ హనుమంతరావుపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  అంతేకాకుండా  ప్రమాదానికి కారణమైన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.