Kondagattu RTC Bus Mishap

బస్సు దారి తప్పిందా...బస్సు మార్గంపై విచారణ జరిపిస్తామన్న మంత్రి ఈటల

Submitted by arun on Tue, 09/11/2018 - 14:07

కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘ‌ట‌నాస్థలంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.