DCP Sumathi

డబ్బులు తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారు: డీసీపీ సుమతి

Submitted by arun on Tue, 09/11/2018 - 11:08

జగ్గారెడ్డి తప్పుడు ధృవపత్రాలతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు. కుటుంబ సభ్యుల పేరుతో వేరే వ్యక్తులను విదేశాలకు పంపారని చెప్పారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌, ఫేక్‌ పాస్‌పోర్టుతో వీసాకు ధరఖాస్తు చేశారని సుమతి తెలిపారు. నాలుగేళ్ల కూతురును 17ఏళ్లుగా, నాలుగేళ్ల కొడుకును 15ఏళ్లుగా చూపించారని.. ఆధార్‌ డేటా చూస్తే నిజానిజాలు బయటపడ్డాయన్నారు. వెళ్లిన ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదని తెలుస్తోందని చెప్పారు.