Theft

నిజాం మ్యూజియం చోరీ కేసును చేధించిన పోలీసులు

Submitted by arun on Tue, 09/11/2018 - 10:03

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజాం మ్యూజియంలో చోరీ కేసును పోలీసులు చేధించారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి బంగారు టిఫిన్ బాక్స్ తో పాటు ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 3న రాత్రి నిజాం మ్యూజియంలో చోరికి పాల్పడిన దుండగులు బంగారు టిఫిన్ బాక్స్ తో పాటు పలు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం అడుగడుగునా పరిశీలించిన పలు కీలక ఆధారాలను సేకరించారు. ఈ ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.