Jagga Reddy

చంచల్ గూడ జైలుకు జగ్గారెడ్డి తరలింపు!

Submitted by arun on Tue, 09/11/2018 - 14:59

2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నెల 25 వరకు జగ్గారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్టు పొందిన కేసులో పోలీసులు నిన్న ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

డబ్బులు తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారు: డీసీపీ సుమతి

Submitted by arun on Tue, 09/11/2018 - 11:08

జగ్గారెడ్డి తప్పుడు ధృవపత్రాలతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు. కుటుంబ సభ్యుల పేరుతో వేరే వ్యక్తులను విదేశాలకు పంపారని చెప్పారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌, ఫేక్‌ పాస్‌పోర్టుతో వీసాకు ధరఖాస్తు చేశారని సుమతి తెలిపారు. నాలుగేళ్ల కూతురును 17ఏళ్లుగా, నాలుగేళ్ల కొడుకును 15ఏళ్లుగా చూపించారని.. ఆధార్‌ డేటా చూస్తే నిజానిజాలు బయటపడ్డాయన్నారు. వెళ్లిన ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదని తెలుస్తోందని చెప్పారు.

ముందస్తు ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్‌‌కు భారీ షాక్‌....

Submitted by arun on Tue, 09/11/2018 - 09:02

ముందస్తు ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్‌‌కు భారీ షాక్‌ తగిలింది. టీకాంగ్రెస్‌ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో పాస్‌పోర్టు, వీసా తీసుకున్న కేసులో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 13ఏళ్ల క్రితం నమోదైన కేసులో కీలక సమాచారం సేకరించిన పోలీసులు అర్ధరాత్రి పటాన్‌‍చెరు దగ్గర అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం జగ్గారెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.