ex-mp-mla-mlc-may-join-congress

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి ఓ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 19:03

ఎన్నికలకు అతికొద్ది సమయం మాత్రమే ఉండగా.. కాంగ్రెస్‌లో చేరేందుకు టీఆర్ఎస్‌ అసమ్మతి నేతలు క్యూ కడుతున్నారు. రాజ్యసభ సభ్యుడి తోపాటు ఇద్దరు ఎమ్మెల్సీల చేరికకు రంగం సిద్ధమైంది. బుధవారం గాంధీ భవన్‌లో ఆజాద్‌, ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో డీఎస్, కొండా సురేఖ, కొండా మురళి, భూపతిరెడ్డి చేరనున్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, ఆకుల రాజేందర్‌ తదితరులు చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా టీఆర్ఎస్ లో ఎంపీ డి. శ్రీనివాస్ కు చేదు అన్హుభావం ఎదురవడంతో అయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంపై డీఎస్ కాంగ్రెస్ పెద్దలను సంప్రదించారు.