heart attack

గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడిన కుక్క

Submitted by arun on Tue, 06/26/2018 - 14:59

మాడ్రిడ్‌లో ఓ పోలీస్ డాగ్ తెలివి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అది తన ట్రైనర్ పాలిట సేవరే (రక్షకురాలే) అయింది. ఎక్సర్ సైజు సందర్భంగా హఠాత్తుగా కింద పడిపోయిన అతగాడు మరణించాడేమోననుకుని పరుగున వచ్చి అతడ్ని సేవ్ చేసేందుకు నానా పాట్లూ పడింది. మ్యాడ్రిడ్ పోలీసులు ఓ కుక్కకు గుండెపోటు బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సీపీఆర్ చేయడంలో దానికి ఇచ్చిన ట్రైనింగ్‌ను పరీక్షించారు పోలీసులు. ఈ నేపథ్యంలో..ట్రైనర్ శిక్షణలో భాగంగా కావాలనే గుండె పోటు వచ్చినట్టు కుప్పకూలగానే.. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన శునకం అతడి ఛాతి మీద ముందు కాళ్లతో బాదింది.

బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండె పోటు

Submitted by arun on Mon, 06/04/2018 - 11:50

గుండె పోటుతో డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. చెన్నై నుంచి తిరుమలకు వస్తున్న బస్సులో డ్రైవర్ అరుణాచలానికి హఠార్తుగా గుండె పోటు వచ్చింది. దీంతో పిచ్చాటూర్ వద్ద బస్సు నిలిపివేశాడు. బస్సులోనే కుప్పకూలిపోయాడు. ముందస్తుగా బస్సు నిలిపివేయడంతో.. ప్రయాణికులకు ప్రాణాలతో బయపడినా, డ్రైవర్‌ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.

యువకులను భయపెడుతున్న గుండెపోటు

Submitted by arun on Wed, 05/23/2018 - 12:28

గతంలో గుండెపోటు 50 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవలి పరిస్థితులు చూస్తుంటే..వృద్ధులకే గుండెపోటు వస్తుందనే నమ్మకం సడలి పోతోంది. చిన్న వయసులో కూడా గుండె పోటు రావచ్చనే భయం పట్టుంది,వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్న కేసులు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. 25 నుంచి 30 ఏళ్ల వయసువాళ్లూ హార్ట్ ఎటాక్ వస్తోంది. గుండెపోటు వచ్చినవారు ముసలివాళ్లయితే ఆ వయసులో సాధారణమే అనుకుంటాం. కానీ... యువకులకు కూడా గుండెపోటు వస్తోందని తెలిసి షాకవుతున్నాం. 

గుండెపోటు పెళ్లికానివారికే ఎక్కువ‌ట‌

Submitted by lakshman on Wed, 04/11/2018 - 06:21

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం.

గుండెపోటు ముప్పును ముందే కనిపెట్టొచ్చు

Submitted by arun on Sat, 03/24/2018 - 17:39

గుండెపోటు ముప్పును ఇక ముందుగానే కనిపెట్టొచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు వంద గంటల ముందే గుండెపోటును కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా కేంద్రానికి నివేదించడంతో దానికి ఆమోదం లభించింది. ఇది అందుబాటులోకి వస్తే.. గుండెపోటు ముప్పు నుంచి బయటపడొచ్చు. 

డీజే చప్పుడు.. నవ వధువును చంపేసింది!

Submitted by arun on Mon, 03/12/2018 - 12:33

ఒక్కోసారి ఆలోచన లేకుండా చేసే సంబరాలు.. జనాల ప్రాణం మీదికి వస్తుంటాయి. అది నిజమే అని.. ఇప్పుడు మరోసారి నిజమైంది. ఈ అనాలోచిత సంబరమే.. ఇప్పుడు ఓ పెళ్లి ఇంట్లో విషాదం మిగిల్చింది. తెలంగాణలోని సూర్యాపేటలో మొన్న రాత్రి ఓ వివాహం జరిగింది. అంతా బానే అయ్యింది. వధువు ప్రవేశం కోసం.. అమ్మాయిని తీసుకుని ఇంటికి అబ్బాయి వాళ్లు బయల్దేరారు.

భార్యను చూసి భావోద్వేగం...ఎమ్మెల్యేకు గుండెపోటు

Submitted by arun on Tue, 01/09/2018 - 17:01

లక్నో బాందా జైలులో యూపీ ఎమ్మెల్యే ముక్తార్‌ అన్సారీకి తీవ్ర గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ముక్తార్‌ అన్సారీ భార్య సైతం ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయవేత్తగా మారిన మాఫియాడాన్‌ అన్సారీని కలిసేందుకు భార్య బాందా జైలుకు వచ్చిన సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ముఖ్తార్ అన్సారీ గత ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన 'ఖ్వామి ఏక్తా దళ్' పార్టీని బీఎస్‌పీలో విలీనం చేశారు. అనంతరం మవు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గుండెపోటుతో 12 కోతులు మృతి!?

Submitted by lakshman on Tue, 09/12/2017 - 19:55

యూపీః గుండెపోటుతో కోతులు చ‌నిపోవ‌డమేంట‌ని క్వ‌శ్చ‌న్ మార్క్ ఫేస్ పెట్ట‌కండి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కొత్వాలీ మ‌హమ్మాది ప్రాంతంలో 12 కోతులు ఒకేచోట చ‌నిపోయి క‌నిపించ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఏ క్రూరమృగం వాటిని గాయ‌ప‌ర‌చ‌లేదు. ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. కానీ కోతులన్నీ ఒకేచోట శవాలుగా క‌నిపించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ పులి ఆ ప్రాంతంలో ప‌దేప‌దే సంచ‌రిస్తున్న దృశ్యాలను కోతులు చూడ‌టం, పులి గాండ్రింపుల‌ను ప‌దేప‌దే విన‌డం వ‌ల్ల గానీ గుండెపోటు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు.